AP: రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటల స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా (GSTతో కలిపి) నిర్ణయించారు. విడుదలైన 4 నుంచి 10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 పెంచుకోవచ్చు. రోజుకు 5 షోల ప్రదర్శనకు హోంశాఖ అనుమతినిచ్చింది.