ఢిల్లీ హైకోర్టు.. టీవీ ప్రేక్షకులకు భారీ ఊరట కల్పించే తీర్పు ఇచ్చింది. టీవీ ఛానళ్లలో ప్రకటనల సమయాన్ని గంటకు గరిష్టంగా 12 ని.లకే పరిమితం చేస్తూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గతంలో తెచ్చిన నిబంధనలను హైకోర్టు సమర్థించింది. 2013లో ట్రాయ్ తీసుకు వచ్చిన ప్రకటనలపై కాలపరిమితిన సవాల్ చేస్తూ బ్రాడ్ కాస్టర్లు వేసిన పిటిషన్ను కోర్టును తిరస్కరించింది.