వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ వివాదంలో చిక్కుకుంది. తమ ‘బీవీ నెం.1’ మూవీలోని ఐకానిక్ పాటలను అనుమతి లేకుండా వాడుతున్నారంటూ పూజా ఎంటర్టైన్మెంట్ సంస్థ దర్శకుడు డేవిడ్ ధావన్‌పై రూ.400 కోట్ల భారీ నష్టపరిహారం దావా వేసింది. సినిమా విడుదల, ప్రమోషన్లపై స్టే ఇవ్వాలని కోరింది. పాటలు తొలగించి, టైటిల్ మార్చకపోతే మరో రూ.100 కోట్లు కట్టాలని హెచ్చరించింది.