గద్దర్ అవార్డుల్లో ఈటీవీ విన్ అద్భుత ప్రతిభ కనబరిచి 6 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సంస్థ నిర్మించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ నాలుగు విభాగాల్లో అవార్డులు సాధించగా, ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్‌గా ‘లిటిల్ హార్ట్స్’, ఉత్తమ బాలల చిత్రంగా ‘అనగనగా’ నిలిచాయి. నాణ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ, అవార్డుల పంట పండించిన ఈటీవీ విన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.