టాలీవుడ్ క్లాసిక్ ‘భక్త కన్నప్ప’ విడుదలై ఇవాళ్టితో 50 ఏళ్లు పూర్తయింది. కృష్ణంరాజు కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఈ భక్తిరస మూవీ టెక్నికల్ వండర్‌గా సంచలనం సృష్టించింది. బాపు దర్శకత్వం, ముళ్లపూడి మాటలు, రాజు గారి నటవిశ్వరూపం మూవీని అమరకావ్యంగా మార్చాయి. ‘శివశివ శంకర’ పాట ఇప్పటికీ భక్తులను ఓలలాడిస్తోంది. ఈ మూవీ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది.