రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో బాక్సాఫీస్ కలెక్షన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వసూళ్లు ముఖ్యమే అయినప్పటికీ.. వాటితోనే విజయాన్ని నిర్ణయించలేమన్నాడు. ‘మంచి నంబర్లు తదుపరి సినిమాలను నిర్ణయిస్తాయి. అవి బాగుంటేనే మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం లభిస్తుంది. అందుకే నంబర్లు ముఖ్యమే.. కానీ అవే విజయానికి ఏకైక కొలమానం కాదు’ అని అన్నాడు.