రణ్వీర్ సింగ్, ‘డాన్ 3’ చిత్ర వివాదంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. రణ్వీర్ను నిషేధించడం అనేది ఒక పెద్ద జోక్ అని ఆయన విమర్శించాడు. రణ్వీర్ను కాదు, అసలు ఆ ఫిల్మ్ ఫెడరేషన్‌ను బ్యాన్ చేయాలని RGV ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యల వల్ల పరిశ్రమను కానీ, సినీ కార్మికులను కానీ కాపాడినట్లు కాదంటూ వర్మ ఖండించాడు.