కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ 2026 మార్చి 19న విడుదల కాబోతుంది. తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ హక్కులు దాదాపు రూ.63 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీంతో కన్నడ చరిత్రలోనే తమిళ మార్కెట్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ఇది సరికొత్త రికార్డు సృష్టించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.