HNK: పరకాల పట్టణంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరగతి గదులు, సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకుందామని వచ్చే విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని, వెంటనే పనులు పూర్తి చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.