తమిళ స్టార్ హీరో నుంచి తమిళనాడు సీఎం అయిన సి. జోసెఫ్ విజయ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వస్తుండగా విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్‌తో ఆయన దిగిన ఫొటో నెట్టింట హల్చల్ చేస్తోంది. సీఎం హోదాలో ఉన్నా విజయ్ చూపిన సాదాసీదా తనం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ టూర్లో ఆయన పీఎం మోదీని కలసి రాష్ట్ర నిధులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.