మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మిశ్రమ విమర్శలు వచ్చినప్పటికీ.. కలెక్షన్ల వర్షం కురుస్తుండటంతో మేకర్స్ సంతోషంలో ఉన్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే ‘దృశ్యం 4’పై అప్పుడే చర్చ మొదలైంది. ఈ సూపర్ హిట్ ఫ్రాంఛైజీని ఇక్కడితో ఆపేస్తారా లేక పార్ట్-4తో ముందుకు తీసుకెళ్తారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.