బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలను అన్‌ఫాలో చేయడంపై స్పందించాడు. దీనిని జాతీయ వార్తగా మార్చవద్దని ఆయన కోరాడు. ఇది కేవలం ‘డిజిటల్ డిటాక్స్’ మాత్రమేనని, ఇన్‌స్టాలో సమయం వృథా కాకుండా ఉండేందుకే అందరినీ అన్‌ఫాలో చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. వ్యూస్ కోసం చిన్న విషయాన్ని సెన్సేషన్ చేయవద్దని అసంతృప్తి వ్యక్తం చేశాడు.