ఐశ్వర్య రాజేష్ తమిళంలో ‘అండర్-18’ అనే మూవీలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. శరత్ కుమార్, రాధిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కార్తీక్ పెరుమాల్సామి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 18 ఏళ్ల లోపు యువత చుట్టూ తిరిగే ఈ కథ, సమాజంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది.