లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఖండించింది. తన మాతృభూమిపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరణించిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ.. వెంటనే ఈ దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. యుద్ధం పరిష్కారం కాదని, చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరించాలని పేర్కొంది.