రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకోవడం, ఆయనపై బ్యాన్ విధిస్తు FWICE నాన్-కోఆపరేషన్ ఆదేశాలు ఇవ్వడంతో వివాదం ముదిరింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగాడట. రణ్వీర్, ఫర్హాన్ అక్తర్‌లతో మంచి సంబంధాలున్న సల్మాన్.. ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, పరిశ్రమ హితం దృష్ట్యా వివాదాన్ని పెద్దది చేయవద్దని సూచించినట్లు సమాచారం.