రామబాణం మూవీ ఫ్లాప్ టాక్ అందుకుంది. గత కొన్నిరోజుల నుంచి గోపిచంద్‌కు సరైన హిట్ పడటం లేదు. ఈ మూవీని వరుణ్ తేజ్ చేయాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తప్పుకున్నారట.
Rama banam: గోపీచంద్ (Gopi chand) కటౌట్‌కి సరిపడి కథలు పడితే.. బాక్సాఫీస్ బద్దలవుతుంది. ఒకప్పటి గోపీచంద్.. అంటే జయం, వర్షం సినిమాలోని విలన్.. యజ్ఙం, రణం వంటి సినిమాల్లోని హీరో గోపీచంద్‌ను (Gopi chand) తిరిగి స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తే చాలు.. హిట్ పడినట్టే. కానీ ఎందుకో గోపీకి ఈ మధ్య అస్సలు వర్కౌట్ అవడం లేదు. రీసెంట్గా వచ్చిన రామబాణం గురి కూడా తప్పింది. ఈ రామబాణం నుంచి ఓ మెగా హీరో కూడా తప్పించుకున్నాడు.
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopi chand) సినిమాలు బాగున్న.. థియేటర్లో మాత్రం ఆడటం లేదు. రోజు రోజుకి గోపీచంద్ మార్కెట్ డౌన్ అవుతునే ఉంది. అందుకు కారణం గోపీచంద్ (Gopi chand) మూస ధోరణిలోనే వెళ్లడం అని చెప్పొచ్చు. అదే నమ్మకంతో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన శ్రీవాస్‌ని గుడ్డిగా నమ్మి, రొటీన్ కమర్షియల్ మూవీ ‘రామబాణం’ చేశాడు. ఈ సినిమా కూడా గోపిచంద్‌ను (Gopi chand) సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది. మే 5న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ షో నుండే డివైడ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో బరిలోకి దిగిన రామబాణం.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి కేవలం మూడు కోట్ల మాత్రమే రాబట్టిందని అంటున్నారు. దాంతో ఇది కూడా గోపీచంద్ (Gopi chand) డిజాస్టర్ లిస్ట్‌లోకి వెళ్లిపోయింది.
ఈ సినిమా ఫస్ట్ ఛాయిస్ గోపిచంద్ కాదని తెలిసే సరికి.. డిజాస్టర్ నుంచి ఆ హీరో తప్పించుకున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ముందుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని భావించారట. వరుణ్ కథ విని.. ఓకే కూడా చెప్పారట. కమర్షియల్ తనకు సినిమా వర్కౌట్ అవుతుందా? అని ఈ ప్రాజెక్ట్‌కి నో చెప్పాడట. ఆ తర్వాత రామబాణం కథ గోపీచంద్ దగ్గరకు వెళ్లడం.. సినిమా ఫ్లాప్ అవడం చకచకా జరిగిపోయాయి. దాంతో మెగా హీరో వరుణ్ ఈ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే వరుణ్ కూడా అంతకుముందు వచ్చిన గని సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఏదేమైనా.. ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామనే.