ఒక మెగాభిమానికి మెగాస్టార్‌నే డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో.. అంతకుమించి వాల్తేరు వీరయ్య ఉంటుందని..అంటున్నాడు డైరెక్టర్ బాబీ. ముఖ్యంగా థియేటర్లో పూనకాలు లోడింగ్ అంటూ ఊరిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్‌లో.. మెగాస్టార్ వింటేజ్ లుక్ చూసి భారీగా ఆశలు పెంచేసుకుంటున్నారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే.. ఇప్పుడో సాలిడ్ లీకేజీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. రవితేజ పాత్ర దాదాపు సినిమాలో చిరుకి ఈక్వల్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ ఇద్దరినీ రెండు దశాబ్దాల తర్వాత బిగ్ స్క్రీన్ పై చూసి గూస్ బంప్స్ గ్యారంటీ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ సీన్‌కు థియేటర్లో విజల్స్ మోత మోగడం ఖాయమంటున్నారు. పోలీస్టేషన్లో చిరంజీవి, రవితేజ ఎదురుపడ్డప్పుడు.. చిరు నోట ఇడియట్ మూవీలోని డైలాగ్ దుమ్ములేచిపోయేలా ఉంటుందంటున్నారు. ‘సిటీకి ఎంతో మంది కమీషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ వీరయ్య లోకల్.. ఇక్కడే ఉంటాడు.. అని అంటాడట చిరు. దానికి కౌంటర్‌గా రవితేజ ఘరానా మొగుడులో.. ఏదీ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని చెప్పడం.. మాములుగా ఉండదట. ఒకరి హిట్ డైలాగ్‌ను మరొకరు చెప్పడం నిజంగా ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పొచ్చు. అయితే అది ఎంజాయ్ చేయాలంటే.. ఈ నెల 13 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.