తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న మినీ బస్సును ఏచర్ వాహనం ఢీకొట్టడంతో దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో 7 మంది మహిళలు దుర్మరణం చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మినీ బస్సు రోడ్డు డివైడర్ పై కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కుప్పం సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది.
తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని చండీయార్ వద్ద ప్రమాదం జరగడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపత్తూరు, క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రులకు పోలీసు అధికారులు తరలించారు. ఘటనపై వానియంబడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.