WGL: వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తుళ్ల రవి ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజును బుధవారం వర్ధన్నపేటలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 12న హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మెన్‌గా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. ఆహ్వాన పత్రికను అందజేశారు.
PDPL: జిల్లా జడ్జి సునీత ఆదేశాల మేరకు ఇవాళ మేడారం జడ్జి సరిత, ఎమ్మార్వో శ్రీనివాస్, ఎస్‌హెచ్‌ఓతో కలిసి ధర్మారం మండలం కొత్తపల్లి దేశాయి నాయక్ ఇటుకబట్టిని తనిఖీ చేశారు. ఒరిస్సాకు చెందిన 30 మంది కార్మికులు తమకు 6 నెలలకు 40,000 చెల్లించాడని, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో కార్మికులకు విముక్తి కల్పించామని జడ్జి సరిత తెలిపారు.
HNK: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని జామా మసీదులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ హాజరయ్యారు. పరకాల పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, రంజాన్ పండుగ సోదరభావం, శాంతి, సామరస్యానికి ప్రతీక అని వారు అన్నారు.
WNP: కన్న కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది మే 3న పానగల్ మండలంకు చెందిన కురుమయ్య కూతురుకు బుక్కులు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి, పెబ్బేరు పరిధిలోని రంగాపురం గ్రామ సమీపంలో జూరాల కాల్వ వద్ద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత తీర్పునిచ్చారు.
HYD: పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా అంబర్పేట డివిజన్ ఎంసీహెచ్ కాలనీలో ముస్లీం ప్రజలకు ప్రభుత్వం అందించిన రంజాన్ తోఫాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ వేడుకలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని MLA సూచించారు.
MNCL: చెన్నూరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. పనులను పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు ఆసుపత్రిని అందించాలని కోరారు.
BHPL: భూపాలపల్లి జిల్లా రజక సంఘం నూతన అధ్యక్షుడిగా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన అయితు బాపు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పూసల సంపత్ బుధవారం వారికి నియామక పత్రాన్ని అందజేశారు. వారి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రజక సంఘం నేతల సమస్యలపై పోరాడుతానని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని బాపు అన్నారు.
WNP: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన కావలి బుడ్డన్న(65) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై జలంధర్ రెడ్డి కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
VKB: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా సాగుతుందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ప్రోత్సహించాలని తెలిపారు.
NRPT: జనాభా అన్నింటికీ ప్రామాణికం అని, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఒక దేశానికి జనగణన అతి ముఖ్యమని, 11 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం జనగణన చేపడుతోందని అధికారులకు సూచించారు.
MBNR: అన్ని కులాలు, మతాల మధ్య సోదర భావం ఐక్యత పెంపొందాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బోనాల శ్రీనివాసులు దాసరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకునే రీతిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమగ్రమైన వివరాలు స్లైడ్స్, వీడియోలతో సహా సిద్ధం చేయాలన్నారు. సర్పంచులు, వార్డు సభ్యుల విధులు వివరించాలన్నారు.
HYD: టీజీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చెప్పటాలని MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ మంగళవారం నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఛైర్మన్ బుర్ర వెంకటేశంని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కొరకు ఎదురుచూస్తూ ఉన్నారని పేర్కొన్నారు.
NGKL: జిల్లా కేంద్రంలోని 22వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ వల్ల లో-ఓల్టేజీ సమస్య తగ్గి, వార్డు ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
SRD: పటాన్చెరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా క్రీడోత్సవాలు రెండో రోజైన బుధవారం ఘనంగా కొనసాగాయి. మైత్రి మైదానంలో జరిగిన పోటీలను ఎమ్మెల్యే జీఎంఆర్, గూడెం యాదమ్మతో కలిసి వీక్షించారు. ఈనెల 12న జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నియోజకవర్గ స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.