ADB: ప్రతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు రూ. 48 లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టు పనులకు భూమి పూజ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.
HYD: వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని CP సజ్జనార్ తెలిపారు. తక్షణమే సిలిండర్ డెలివరీ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ SMలో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, SMSల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.
HYD: గచ్చిబౌలి పరిధిలోని శిల్ప లే అవుట్ వద్ద గోవా నుంచి LSD పేపర్లు తెచ్చి విక్రయిస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. సూరజ్ సింగ్, కస్టమర్ గోపీని శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల వద్ద రూ. 80 వేల విలువైన 27 LSD పేపర్లు, కారు, స్కూటీ, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
WNP: చిన్నంబావి, వీపనగండ్ల కేజీబీవీ పాఠశాలల్లో బుధవారం ’99 రోజుల ప్రజాపాలన’లో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రక్తహీనత, చర్మ వ్యాధులు, కంటి సమస్యలను గుర్తించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. మొత్తం 90 మంది విద్యార్థులకు వైద్య సేవలు అందించినట్లు వైద్య బృందం తెలిపింది.
MHBD: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురిని మరిపెడ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అరకు(AP) నుండి లూనవత్ ప్రవీణ్, బోడా కార్తీక్, బాణోత్ శివ, అభిషేక్, ఒక మైనర్ బాలుడు అక్రమంగా గంజాయి తీసుకొని వచ్చి, మరిపెడలో అమ్ముదామని రాజీవ్ సెంటర్ వద్దకు వచ్చారు. నమ్మదగిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ సీఐ హతిరాం ఆద్వర్యంలో వారిని పట్టుకొని, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
WNP: చెన్నారం గ్రామంలో మీసేవ రీ ఓపెన్ చేశారు. దీంతో చెన్నారం, గొల్లపల్లి, చీర్కపల్లి, మాచుపల్లి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఏదుల మండలానికి ఒక్కటే మీసేవ ఉండటం వలన ఏదుల మండలంలోని 8 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చెన్నారం గ్రామంలో మీసేవ రీ ఓపెన్ కావడం వల్ల చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
NLG: వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వెనుక ఉన్న నర్సరీలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 800 నుంచి 900 మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కుడకుడ రోడ్డులోని వీఎన్ఆర్ వైన్స్ వద్ద బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది
KMR: ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుని, వారి వద్ద నుంచి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు. సీఐ సంపత్ కుమార్, ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.
MNCL: చెన్నూర్ పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం చెన్నూర్‌లో మాట్లాడుతూ.. బస్ డిపో భూ వివాదాన్ని త్వరగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. చెన్నూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుతం నడిపిస్తున్న బస్సులకు అదనంగా మరొక బస్సు ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.
HYD: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (82) బుధవారం కన్నుమూశారు. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇవాళ ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్ నివాసానికి తీసుకువస్తున్నట్లు ఎంపీ శ్రీభరత్ తెలిపారు. ఆయన అంత్యక్రియలను మార్చి 12న జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లా DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో పెంచికల్ పేట్ మండల కేంద్రంలో మండల అధ్యక్ష దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల నాయకులంతా సముద్రాల రాజన్నని ఏకగ్రీవం చేయాలని ప్రతిపాదించారు. దీంతో MLC విఠల్, DCC ఆత్రం సుగుణలు, పెంచికల్ పేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా రాజన్నని ఏకగ్రీవంగా నియమించారు.
SRCL: జనగణన పకడ్బందీగా పూర్తి చేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో చార్జ్ ఆఫీసర్లు, అదనపు ఛార్జ్ ఆఫీసర్లకు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన ఇది అని వెల్లడించారు. కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
NGKL: నిరుపేదల వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మార్చల్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన చెక్కును ఆయన అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన వైద్యం తీసుకోలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక గొప్ప వరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
PDPL: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇవాళ క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వారికి దేవాలయాల ప్రాముఖ్యతను వివరించారు. అందరూ కలిసి భోజనాలు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. హెచ్ఎం నూతి మల్లన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.