• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాకు చేరుకున్న మహసేన రథయాత్ర..

HNK: రాష్ట్రంలో చేపడుతున్న జై భీమ్ మహాసేన రథయాత్ర జిల్లాకు చేరుకుంది. యాత్ర చేస్తున్న వారికి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వద్ద కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(KVPS) నేతలు ఘన స్వాగతం పలికారు. విద్యాభ్యాసం నుంచే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని, భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేతలు అన్నారు.

March 11, 2026 / 07:43 PM IST

టెన్త్ పరీక్షలు.. డీఈవో కీలక సూచనలు

SRD: జిల్లాలో ఈనెల 14 నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లావ్యాప్తంగా 123 కేంద్రాల్లో 24,611 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలి’ అని సూచించారు.

March 11, 2026 / 07:42 PM IST

మండలంలో పర్యటించిన నితి అయోగ్ కన్సల్టెంట్

MLG: కన్నాయిగూడెం మండలంలో ఆస్పిరేషన్ బ్లాక్ సంపూర్ణ అభియాన్ 2.0 కార్యక్రమం అమలును పరిశీలించేందుకు నితి ఆయోగ్ కన్సల్టెంట్ శ్రీ కృష్ణన్ గోపాల్ పర్యటించారు. మండలంలోని పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలు, విద్యార్థి వసతి గృహాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పోషకాహారం, బోధన విధానం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

March 11, 2026 / 07:42 PM IST

‘సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేయాలి’

SRCL: మతపరమైన సేవలతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా, పాస్టర్లు ప్రజల్లో మంచి మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో జరిగిన, జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంకు ఆయన హాజరయ్యారు.

March 11, 2026 / 07:41 PM IST

బార్ ఎన్నికలకు నామినేషన్లు ముగింపు

KMM: మధిర బార్ అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది చింతల గోపాల్ వివరాలు వెల్లడించారు. అధ్యక్ష పదవికి రామరాజు, రమేష్‌తో పాటు చివరి రోజు పుల్లారావు, కృష్ణారావు నామినేషన్ దాఖలు చేయడంతో మొత్తం నలుగురు పోటీలో ఉన్నారు. ఇతర పదవులకు కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.

March 11, 2026 / 07:39 PM IST

LOC చెక్ అందజేసిన మాజీ మంత్రి

SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరుకు చెందిన మోతే ఐలేశ్ ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స ఖర్చుల నిమిత్తం అతనికి మంజూరైన రూ. 2 లక్షల LOC చెక్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ సునీత మధు ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 

March 11, 2026 / 07:39 PM IST

వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి

MNCL: లక్షెట్టిపేటకు చెందిన లకావత్ గణేష్ (45) వడదెబ్బతో మృతి చెందాడని ఏఎస్సై అన్వర్ తెలిపారు. గణేష్ మంగళవారం కొడుకు రాజేశ్వర్‌ను రూ. 20 అడిగి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. బుధవారం ఉదయం ఇటిక్యాల చెరువు వద్ద గణేష్ శవం ఉందని స్థానికులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారన్నారు. గణేష్ చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందాడన్నారు.

March 11, 2026 / 07:38 PM IST

రైతు భరోసా, బోనస్ డబ్బులు వేయాలని బీజేపీ నేతల నిరసన

BHPL: రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, సన్న వడ్ల బోనస్ వెంటనే రైతుల అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేస్తూ మహాముత్తారం మండల కేంద్రంలో బీజేపీ నేతలు బుధవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు పూటకు ఒక అబద్దం చెబుతూ.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. లేదంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరసన చేపడుతామని హెచ్చరించారు.

March 11, 2026 / 07:37 PM IST

మియాపూర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు!

RR: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని ముక్తా మహబూబ్‌పేట్‌లో BRS నాయకులు BSN కిరణ్ యాదవ్, జహంగీర్, శివరాజ్ సంయుక్తంగా ముస్లిం సోదరులకు భారీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

March 11, 2026 / 07:36 PM IST

కలెక్టర్‌ను కలిసిన రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు

BDK: కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ అంకిత్‌ను రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొడాలి వెంకటేశ్వరరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించినట్లు కొడాలి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ రేషన్ డీలర్ నిమ్మలపూడి రాజయ్య పాల్గొన్నారు.

March 11, 2026 / 07:35 PM IST

చెన్నకేశవ ఆలయానికి ఏసీలు బహూకరణ

MBNR: జడ్చర్ల మండలం గంగాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో రెండు ఏసీలను అందజేశారు. భక్తుల సౌకర్యార్థం వీటిని బహూకరించిన బ్యాంక్ మేనేజర్ అశోక్, సిబ్బందిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దీప్తి రెడ్డి బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

March 11, 2026 / 07:35 PM IST

కొత్త బోరు బావి ఏర్పాటుకు వినతి

RR: నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులలో భాగంగా చేవెళ్ల పరిధిలోని అంతారం గ్రామ పంచాయతీకి చెందిన బోరుబావి తొలగిపోయిందని సర్పంచ్ రామస్వామి అన్నారు. గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడటంతో ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ ప్రజల అవసరార్థం కొత్త బోరు బావి ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 11, 2026 / 07:34 PM IST

తాజ్‌పూర్‌లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

BHNG: భువనగిరి మండలం తాజ్‌పూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక కొన్నత పాఠశాలలో బుధవారం సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు వివిధ పాత్రలు పోషించి ఎంతో చక్కని ప్రతిభను కనబరిచారని వారిని అభినందించారు.

March 11, 2026 / 07:32 PM IST

పార్లమెంట్ BSP ఇంఛార్జ్‌గా పృథ్వీరాజ్

NGKL: నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీఎస్పీ ఇంఛార్జ్‌గా తూడుకుర్తి గ్రామానికి చెందిన బండి పృథ్వీరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

March 11, 2026 / 07:32 PM IST

TAC బోర్డు సభ్యుడిగా పసుల నీరజ్

NRPT: నర్వ మండలం ఉండేకోడ్ గ్రామానికి చెందిన అడ్వకేట్ పసుల నీరజ్ TAC బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు కాట్రగడ్డ విజయ్ హైదరాబాద్‌లో ఇవాళ జరిగిన భేటీలో ఆయనను అభినందించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బలాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.

March 11, 2026 / 07:30 PM IST