• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి: తిరుపతి

BHPL: గణపురం (M) కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రక్రియ మొదలైంది. 6వ తరగతిలో కొత్త ప్రవేశాలతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు HM తిరుపతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు TGMS అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని HM సూచించారు.

February 20, 2026 / 10:59 AM IST

‘అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలి’

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు సహకరించాలని కార్పొరేటర్లు రాచకొండ గోపాల్ రావు, సుధమల్ల హరికృష్ణ కోరారు. శుక్రవారం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నాయకులు వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామన్నారు.

February 20, 2026 / 10:58 AM IST

సత్తా చాటిన ఉట్నూర్ విద్యార్థులు

ADB: రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో ఉట్నూర్‌లోని ‘వికాసం’ ప్రత్యేక బాలల పాఠశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ సాధించి సత్తా చాటారు. విజేతలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. వైకల్యం అనేది ప్రతిభకు అడ్డుకాదని విద్యార్థులు నిరూపించారని కొనియాడారు. వీరికి భవిష్యత్తులో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

February 20, 2026 / 10:53 AM IST

మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

KMM: కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలో మెట్టెల రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి రూ. 9000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. మృతుడు రవి నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబానికి అండగా నిలిచినట్లు నాయకులు వెల్లడించారు.

February 20, 2026 / 10:52 AM IST

ఇలాంటి నాయకుడు గ్రామానికి అవసరం

RR: కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామంలో గత 4 రోజులుగా 1వ వార్డులో బోరు మోటార్ పాడైంది. ఈ విషయాన్ని వెంటనే స్థానికులు వార్డ్ మెంబర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు. సర్పంచ్ వెంటనే బోరుమోటర్‌ను బాగు చేయించారు. సమస్యకు వెంటనే స్పందించే ఇలాంటి గొప్ప నాయకుడు గ్రామంలో ఉండటం గ్రామానికి ఎంతో అవసరమని ప్రజలు అన్నారు.

February 20, 2026 / 10:51 AM IST

ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: జగ్గయ్యపేట గ్రామానికి చెందిన పలువురు అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.

February 20, 2026 / 10:50 AM IST

22న బేస్ లైన్ పరీక్షలు

MDK: ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు బేస్ లైన్ పరీక్షలు ఈనెల 22న నిర్వహించనున్నట్లు డీఈవో విజయ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గల అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లు ఈ విషయం విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అభ్యాసకులు తప్పకుండ పరీక్షలకు హాజరయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివరాలకు ఎస్.వెంకటస్వామి కో-ఆర్డినేటర్ 8008403635 కు ఫోన్ చేయాలని సూచించారు.

February 20, 2026 / 10:46 AM IST

మున్సిపాలిటీలో కో-ఆప్షన్ పదవులపై తీవ్ర ఆసక్తి

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు సమాన హోదా ఉన్న కో-ఆప్షన్ పదవులు రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం 30 వార్డులతో పాటు 4 కో-ఆప్షన్ సీట్లు ఉండటంతో ఎన్నికల్లో టికెట్ రాని ఆశావహులు, తక్కువ మెజారిటీతో ఓడిపోయిన అభ్యర్థులు, మైనారిటీ నాయకులు ఈ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

February 20, 2026 / 10:45 AM IST

‘మన వార్డు -మన శుభ్రత’ కార్యక్రమం

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో కౌన్సిలర్ జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘మన వార్డు -మన శుభ్రత’ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం మున్సిపల్ కార్మికులతో కలిసి వార్డులోని ప్రధాన డ్రైనేజీ కాలువల్లో పూడికలు తీయించి, మురుగు నీరు నిల్వ ఉంచకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు సమస్యల కొరకు నిరంతరం కృషి చేస్తానన్నారు.

February 20, 2026 / 10:44 AM IST

నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దు: ఏసీపీ

RR: ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసేటప్పుడు అచ్చం ఒరిజినల్‌ వెబ్‌సైట్లను పోలి ఉండేలా నకిలీ సైట్లు ఉంటాయని, వాటితో జర జాగ్రత్తగా ఉండాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కెపివి రాజు సూచించారు. ఒక్క అక్షరం తేడాతో మిమ్మల్ని నమ్మిస్తారని, తెలియని వెబ్‌సైట్లలో మీ వ్యక్తిగత సమాచారాన్ని అస్సలు ఇవ్వద్దన్నారు. నకిలీ వెబ్‌సైట్‌లను నమ్మి మోసపోవద్దు అన్నారు.

February 20, 2026 / 10:43 AM IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఆహ్వానం

RR: రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడాధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు LBనగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. ఈనెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు ONLINEలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

February 20, 2026 / 10:42 AM IST

గ్రంథాలయాన్ని సందర్శించిన సర్పంచ్

BDK: టేకులపల్లి సర్పంచ్ బోడ బాలు శుక్రవారం స్థానిక గ్రంధాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రంథాలయంలోని సౌకర్యాలు పరిసరాలు పరిశీలించారు. పుస్తకాల వివరాలను గ్రంథ పాలకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని వారికి సర్పంచ్ హామీ ఇచ్చారు. వారితోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 10:39 AM IST

సీఎం ప్రభుత్వం నిరుపేదలకే అందజేస్తుంది: MLA

RR: షాద్‌నగర్ పట్టణంలోని 17వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాన్ని కట్టుకుని నేడు లబ్ధిదారులు పండగ చేసుకుంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలను నిరుపేదలకు అందజేస్తుందని పేర్కొన్నారు.

February 20, 2026 / 10:38 AM IST

‘ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలి’

ASF: కాగజ్ నగర్‌లో ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని బూత్ లెవెల్ అధికారులు గత నెల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని MRO మధుకర్ శుక్రవారం కోరారు. తమ వారసులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డు వివరాలు సేకరించి సంబంధిత BLOలకు అందజేయాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 10:35 AM IST

న్యాయవాది సూర్యం మృతికి గాండ్ల సురేష్ నివాళి

BDK: మణుగూరు మండలం రాజుపేట గ్రామానికి చెందిన న్యాయవాది పగిడిపల్లి సూర్యం అనారోగ్యంతో నిన్న మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ సూర్యం భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 10:32 AM IST