ASF: కాగజ్ నగర్లో ఓటరు అనుసంధానం కార్యక్రమాన్ని బూత్ లెవెల్ అధికారులు గత నెల నుంచి నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఓటర్లు సహకరించాలని MRO మధుకర్ శుక్రవారం కోరారు. తమ వారసులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న ఓటరు గుర్తింపు కార్డు వివరాలు సేకరించి సంబంధిత BLOలకు అందజేయాలని ఆయన సూచించారు.