RR: షాద్నగర్ పట్టణంలోని 17వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహాన్ని కట్టుకుని నేడు లబ్ధిదారులు పండగ చేసుకుంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలను నిరుపేదలకు అందజేస్తుందని పేర్కొన్నారు.