NRML: లక్ష్మణచందా మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం, వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులంతా బోర్డు పరీక్షలు చక్కగా రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. జీవితంలో గొప్ప స్థానంలో నిలవాలని తెలిపారు.
BDK: మణుగూరు మండలంలోని కూనవరం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.20 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించేందుకు ఈ నూతన భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ASF: రెబ్బెన మండలం ఇందిరా నగర్‌లో ఏప్రిల్ 3న నిర్వహించనున్న మహంకాళీ జాతరకు రావాలని రామగుండం CP అంబర్ కిషోర్ ఝాను ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి బుధవారం ఆహ్వానించారు. రామగుండం కార్యాలయంలో సీపీని జాతర నిర్వాహకులు కలిసి శ్రీకనక దుర్గాదేవి, స్వయంభూ శ్రీమహంకాళీ దేవస్థానం విశిష్టతను వివరించారు. సభ్యులు తిరుపతి, ప్రవీణ్ పాల్గొన్నారు.
SDPT: యుద్ధాల సాకుతో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరల పెంపును విరమించుకోవాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బుధవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్‌తో ఆందోళన నిర్వహించారు. ఇందులో స్థానికులు పాల్గొన్నారు.
KMR: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. బుధవారం కాలువలో కొట్టుకొని వచ్చిన శవాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి వయస్సు సుమారు 65 సంవత్సరాలు, ఎత్తు ఐదు అడుగులు, చామనచాయ రంగు, కోల ముఖం ఉందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
MHBD: ఈనెల 15వ తేదీన దంతాలపల్లిలో నిర్వహించబోయే భీమ్ దీక్ష పోస్టర్లను స్వేరోస్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ఆవిష్కరించారు. అనంతరం భీమ్ దీక్ష కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీకి స్వేరోస్ నేతలు ఆహ్వాన పత్రం అందజేశారు. భీమ్ జ్ఞాన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, తదితర అంశాలను ఎమ్మెల్సీకి నేతలు వివరించారు.
MHBD: తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక గ్రామీణ పేదల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలని, కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు.
ADB: ఉట్నూర్ కేంద్రంలోని పీఎంఆర్సీలో ఉమ్మడి జిల్లా యూత్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే ప్రతాప్ రెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.
MNCL: బెల్లంపల్లి ఏరియా వర్క్ షాప్ మూసివేసే ఆలోచనను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని HMS ఏరియా వైస్ ప్రెసిడెంట్ రాజబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం DGM జ్ఞానేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. IED నిబంధనల ప్రకారం సూపర్వైజర్లు, టెక్నీషియన్లను నియమించి వర్క్ షాప్ కాపాడాలని, వర్క్ షాప్ మూసివేత అంశంపై AITUC నాయకులు నిర్లక్ష్య వైఖరి సరికాదన్నారు.
NGKL: వెల్దండ మండలం శంకర్ కొండ తండాలో ఓ ఫౌండేషన్ సహకారంతో రూ.1,50,000లతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఫౌండేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తండావసూలు మాట్లాడుతూ.. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి త్రాగునీటీ సమస్యను తీర్చేందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
GDWL: శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్ సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో 69 మంది అభ్యర్థులకు ఆయన లైసెన్స్ పత్రాలను పంపిణీ చేశారు. వీరు ప్రైవేటు భూములతో పాటు, నక్ష లేని గ్రామాల్లో కూడా సర్వే నిర్వహించేందుకు అర్హులని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.
NRPT: నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎక్సైజ్, పోలీస్ విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 20 పాఠశాలలకు చెందిన 60 మంది విద్యార్థులు (ప్రహరీ క్లబ్) సభ్యులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారికి మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే శారీరక, మానసిక, సామాజిక విపత్తులపై శిక్షణ ఇచ్చామన్నారు.
JN: జిల్లాలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులకు అవసరమైన భూ సేకరణకు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆర్అండ్ఆర్ కమీషనర్ కె.శివకుమార్ నాయుడు తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై జరిగిన సమీక్షలో పాల...
PDPL: జిల్లాలో వేసవికాలం తాగునీటి సమస్య నివారణకు మంత్రి శ్రీధర్ బాబు, తాను నిధులు సమకూరుస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఆయన ప్రజా ప్రతినిధులకు ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ అమలుపై స్థానిక సంస్థల ప్రతినిధులకు నిర్వహించిన అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
SRCL: రైతు ఏడ్చిన రాజ్యం నిలవదని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రసమయి బాలకిషన్ అన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌లో కాలేశ్వరం 11వ కాలువ పనులను పూర్తి చేయాలని ధర్నా చేస్తున్న రైతులకు ఆయన మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వపరులు పూర్తి చేయాలని నెల రోజులుగా రైతులు నిరాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకునే వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.