• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ప్రభుత్వ సొత్తు రికవరీ చేయాలని ఫిర్యాదు

MNCL: కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామంలో ప్రభుత్వ సొత్తు చోరీ కావడంపై చర్యలు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నర్సరీ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన సింటెక్స్ వాటర్ ట్యాంక్, శ్మశాన వాటిక దగ్గర సోలార్ లైట్ కనిపించడం లేదని తెలిపారు. ఈ మేరకు వెంటనే వీటిని రికవరీ చేయాలని అధికారులను కోరారు.

March 18, 2026 / 12:14 PM IST

ఈ నెల 20న ఉస్మానియాలో జాబ్ మేళా!

HYD: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో పార్మసీ ఈ నెల 20న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టులకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ లేదా ఏదైనా డిగ్రీ ఉన్న18-35 ఏళ్ల వారు అర్హులు. రూ.16,383 నుంచి రూ.19,769 వరకు వేతనం ఉంటుంది.

March 18, 2026 / 12:04 PM IST

తాడువాయిలో పశువులకు ఉచిత టీకాలు..

SRPT: పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని గ్రామ సర్పంచ్ కొలిశెట్టి రాంబాయమ్మ అన్నారు. బుధవారం మునగాల మండలం తాడువాయి గ్రామంలో నిర్వహించిన ఉచిత టీకా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ముందస్తు టీకాలతో పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 18, 2026 / 12:02 PM IST

మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్‌వో

KMR: రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఎంహెచ్‌వో డాక్టర రవీందర్ గౌడ్ సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. జనరల్ ఆసుపత్రి నుంచి వచ్చిన నిపుణులైన వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

March 18, 2026 / 12:01 PM IST

రవాణా శాఖలో 50కి పైగా సంస్కరణలు

KNR: రవాణాశాఖలో 50కి పైగా సంస్కరణలు చేపట్టామని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ప్రమేయం లేకుండా 37 ప్రభుత్వ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పాత వాహనాల స్క్రాపింగ్‌కు రాయితీలతో పాటు, EVలకు 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు.

March 18, 2026 / 12:00 PM IST

బుద్ధవనం.. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రం

NLG: నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనం బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బుద్ధుడి జీవితం, బోధనలు, జాతక కథలను ప్రతిబింబించే శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ప్రదేశాలతో పాటు థీమ్ పార్కులు, మ్యూజియం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

March 18, 2026 / 11:59 AM IST

జిల్లాలో గ్యాస్ కొరతలేదు: జిల్లా సివిల్ సప్లై అధికారి

MLG: యుద్ధం కారణంగా MLG జిల్లాలో గ్యాస్ కొరత పై దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జిల్లా సివిల్ సప్లై అధికారి సయ్యద్ షా ఫైసల్ స్పష్టం చేశారు. జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల కొరతలేదని వెల్లడించారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18004257109 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

March 18, 2026 / 11:53 AM IST

బొంతపల్లి ఆలయంలో పూర్ణాహుతి హోమం

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా పూర్ణాహుతి ప్రత్యేక హోమం నిర్వహించారు. ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో బీద పండితుల సమక్షంలో జరిగిన ఈ హోమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

March 18, 2026 / 11:52 AM IST

నరకప్రాయంగా మారిన లింకేజీ రోడ్డు

ASF: ఆసిఫాబాద్ నుంచి గుండి గ్రామానికి వెళ్లే లింకేజీ రోడ్డు దయనీయంగా తయారైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డంతా గుంతలమయంగా మారి ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన చెందారు. వర్షాకాలంలో బురద కారణంగా వాహనాలు నడపడం ప్రాణసంకటంగా మారుతోందని బుధవారం రోడ్డుపై నిలబడి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి కొత్త రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.

March 18, 2026 / 11:51 AM IST

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: డీఎస్పీ

ADB: ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో ‘సే నో టూ డ్రగ్స్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈగల్ ఫోర్స్ డీఎస్పీ భిక్షపతి మాట్లాడుతూ.. యువత మత్తుకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

March 18, 2026 / 11:48 AM IST

ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్

MDK: మెదక్ నుంచి సుమారు 80 మంది ప్రయాణికులతో బొడ్మట్‌పల్లి వెళ్తున్న RTC బస్సుకు టేక్మాల్ వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఒక్కసారిగా ముందు టైరు పగిలిపోవడంతో డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వాహనాన్ని సురక్షితంగా నిలిపివేశారు. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. అయితే సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.

March 18, 2026 / 11:43 AM IST

పదో తరగతి హిందీ పరీక్షకు ఇద్దరు గైర్హాజరు

MBNR: జడ్చర్ల మండలంలోని 8 కేంద్రాల్లో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,826 మంది విద్యార్థులకుగాను 1,824 మంది హాజరైనట్లు ఎంఈవో మంజులాదేవి తెలిపారు. పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

March 18, 2026 / 11:43 AM IST

పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

BDK: పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో మణుగూరులోని పరీక్ష కేంద్రాలను ఇవాళ డీఎస్పీ రవీంద్ర రెడ్డి, సీఐ నాగబాబు పరిశీలించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని డీఎస్పీ సూచించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

March 18, 2026 / 11:42 AM IST

‘పశువుల సంత వేలంపాట వాయిదా’

MNCL: జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడలో నిర్వహించే పశువుల సంత వేలంపాటను వాయిదా వేశామని గ్రామ సర్పంచ్ అల్లం మాధవి-రవి, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రేండ్లగూడ పంచాయతీ కార్యాలయంలో పశువుల వారసంత వేలం పాటను నిర్వహించారు. అయితే సరైన డిపాజిట్ రాకపోవడంతో వేలంపాటను శుక్రవారానికి వాయిదా వేశామన్నారు. ఈ మేరకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

March 18, 2026 / 11:41 AM IST

కట్ర్యాలలో ఉచిత ఆరోగ్య శిబిరం

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో డాక్టర్ ఆకారపు రాజగోపాల్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరంలో 156 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిబిరంలో రక్తపోటు, షుగర్, సాధారణ జ్వరాలు, శ్వాసకోశ సమస్యలు వంటి అనేక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

March 18, 2026 / 11:37 AM IST