• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆర్టీసీ బస్టాండ్‌లో అన్నదాన కార్యక్రమం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌‌లో బుధవారం మధ్యాహ్నం అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

March 18, 2026 / 03:02 PM IST

ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ప్రతీక: వీసీ

MBNR: పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ ప్రో జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పరాభవ నామ కొత్త సంవత్సరంలో విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రో. పీ. రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 03:01 PM IST

పాడి రైతుల సంక్షేమానికి కృషి: కలెక్టర్

GDWL: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని అందులో భాగంగా పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గాలికుంటు టీకాల ప్రచార వాహనాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో సుమారు 1.08 లక్షల పాడి పశువులు ఉన్నాయన్నారు.

March 18, 2026 / 03:01 PM IST

రవాణా సౌకర్యాలపై ఎమ్మెల్యే దృష్టి

JGL: రాయికల్, సారంగాపూర్ మండలాల్లో బస్సు సౌకర్యం కల్పించి సమయాల్లో మార్పులు చేయాలని సర్పంచులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల RTC DMను కలిసి వినతిపత్రం అందజేశారు. వడ్డెర కాలనీ, ధావన్పల్లి, వస్తాపూర్, ఇటిక్యాల ,మూటపల్లి, కిష్టంపేట, తాట్లవాయి, బోర్నపల్లి, బట్టపల్లి, పోతారం గ్రామాల్లో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

March 18, 2026 / 03:01 PM IST

సజావుగా పదవ తరగతి వార్షిక పరీక్షలు

MNCL: జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 9,685 మందికి గాను 9662 మంది, గతంలో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులకు ఒక్కరూ హాజరయ్యారు. మొత్తం 9688 మంది విద్యార్థులకు 9663 హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.

March 18, 2026 / 03:01 PM IST

ఫరీద్ పేట్‌కు 444 బస్తాల యూరియా బస్తాలు..!

KMR: పాల్వంచ మండలం ఫరీద్ పేట్‌లో యూరియా కొరత సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ జీడిపల్లి నర్సింహా రెడ్డి ఇటీవల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై స్పందించిన షబ్బీర్ అలీ చర్యలు తీసుకుని బుధవారం గ్రామానికి 444 బస్తాల యూరియా బస్తాలను పంపిణీ చేయించారు. రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని వాటిని పొందవచ్చన్నారు.

March 18, 2026 / 03:01 PM IST

‘వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు’

SDPT: ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లిలో ప్రజలకు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నూతన గేట్వాల్ నిర్మాణం చేసినట్లు సర్పంచ్ బర్మా రాజమల్లయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసే గేట్వాల్ రిపేర్ కావడంతో దానిని తీసి వేయించి కొత్త గేట్వాల్ వేసినట్లు వెల్లడించారు. ప్రజలకు తాగునీరు ఎద్దడి లేకుండా చూడడమే లక్ష్యమని అన్నారు.

March 18, 2026 / 03:00 PM IST

మాజీ ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు

NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ అధిష్ఠానం తమిళనాడు ఎన్నికల ఇంఛార్జ్‌గా నియమించింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఆయన పనిచేయనున్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.

March 18, 2026 / 03:00 PM IST

ఇంటింటికి వెళ్లి వైద్య సహాయం

MDK: నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సేవలు అందించారు. గ్రామస్తుల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ విధంగా ఇంటి వద్దకే వైద్యం అందించడం పట్ల గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ పాల్గొన్నారు0

March 18, 2026 / 03:00 PM IST

పది పరీక్షకు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలలో గురువారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు ఏడుగురు విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఈవో భోజన్న తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9722 మంది విద్యార్థులకు గాను 9715 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ప్రశాంతంగా పరీక్షను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 99.93 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

March 18, 2026 / 02:59 PM IST

ముమ్మరంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య చర్యలు

KMM: మధిర మున్సిపాలిటీలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా నిర్వహించారు.

March 18, 2026 / 02:53 PM IST

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎస్పీ

MHBD: పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరీక్ష కేంద్రాల నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని DSP తిరుపతిరావు సూచించారు. బయ్యారంలో ఏర్పాటుచేసిన పదవతరగతి పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని ఆయన సూచనలు చేశారు.

March 18, 2026 / 02:51 PM IST

జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: MLA

NZB: జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాతో కలిసి ఆయిల్ పామ్ ఇండస్ట్రీ నెలకొల్పేందుకు అనువైన స్థలాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 02:50 PM IST

పదవ తరగతి పరీక్షకు 100 శాతం హాజరు

KMR: బీర్కుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏ సెంటర్‌లో 147 మంది, బీ సెంటర్‌లో 146 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 100% మంది పరీక్షకు హాజరయ్యారు. ఫ్లైయింగ్ స్కాడ్ బృందం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసింది.

March 18, 2026 / 02:48 PM IST

ఆసుపత్రికి వెళ్లాలంటే ముక్కులు మూసుకోవాల్సిందే

BDK: జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంతంలోని రేడియాలజీ హబ్ మెయిన్ గేటు ముందు చచ్చిన కుక్క కళేబరం దుర్వాసన వెదజల్లుతోందని నేడు రోగులు వెల్లడించారు. అటుగా వెళ్లే వాళ్లు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎక్స్ రే, స్కానింగ్ కోసం కేంద్రానికి వచ్చే పేషెంట్లకు కుళ్లిన కుక్క కళేబరం కంపుతో స్వాగతం పలుకుతోంది.

March 18, 2026 / 02:47 PM IST