• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

60 కిలోల అడవిపంది మాంసం స్వాధీనం

KMM: పెనుబల్లి మండలం తాళ్లపెంట సమీపంలో విద్యుత్తు తీగలతో అడవిపందిని వేటాడుతున్న ముగ్గురు వ్యక్తులను తల్లాడ రేంజ్ అటవీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేశారు. వారి నుంచి 60 KGల మాంసం రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ అధికారి ఉమ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారవ్వగా పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

March 18, 2026 / 07:30 AM IST

ప్రమాదవశాత్తు నీట మునిగి యువకుడు మృతి

SRD: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన ఆదిత్య (17) మియాపూర్‌లో నివసిస్తూ ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మల్లంపేటలో బంధువుల ఇంటికి వచ్చి, స్నేహితులతో కలిసి కాజిపల్లి శివారులోని కంకర క్వారీలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 18, 2026 / 07:30 AM IST

ఈనెల 19న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

PDPL: సింగరేణి ఆర్జీ-1 ఏరియా పరిధిలోని ఆర్సీఓఏ క్లబ్‌లో ఈనెల 19న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో ఆయుర్వేద నిపుణులు విశ్వనాధ మహర్షి పాల్గొని బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.

March 18, 2026 / 07:27 AM IST

తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఉగాది పండుగ వేడుకలు నిర్వహిస్తున్నామని శాఖ అధిపతి మన్నెమోని కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపకులపతి శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని సూచించారు.

March 18, 2026 / 07:27 AM IST

సాకార భవనంలో TCGO’S డైరీ ఆవిష్కరణ

KNR: తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ అధికారుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సహకార భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. శాఖ చరిత్ర, ముఖ్య సమాచారం, ఉపయోగకరమైన వివరాలతో డైరీని రూపొందించినట్లు తెలిపారు. సహకార రంగ అభివృద్ధికి ఉద్యోగులు సమష్టిగా పనిచేయాలన్నారు.

March 18, 2026 / 07:24 AM IST

బాలల సంరక్ష సేవా కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

HNK: ఆత్మకూర్ మండలంలోని బాలల సంరక్ష సేవా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చావత్ బాజ్ పాయ్ సందర్శించారు. శిశు గృహాలలోని సదుపాయాలు, బాలల సంరక్షణ, పోషణ, ఆరోగ్య పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. చిన్నారుల అభివృద్ధి కోసం అధికారులు పనిచేయాల్సిందిగా సూచించారు.

March 18, 2026 / 07:22 AM IST

పెద్దమ్మ గూడెంలో ఫలారం బండి ఊరేగింపు

SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ గూడెం ఎల్లమ్మ జాతర సందర్భంగా నిర్వహించిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వడ్డె కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 18, 2026 / 07:20 AM IST

125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ

JGL: చెగ్యాం రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం పద్ధతులు, ప్రయోజనాలను వివరించారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచ్, వ్యవసాయ అధికారి సాయి కిరణ్, అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 07:17 AM IST

వడ్డేపల్లిలో 72.99 శాతం పన్ను వసూళ్లు

GDWL: వడ్డేపల్లిలో మున్సిపల్ కమిషనర్ రాజయ్య పర్యవేక్షణలో  పారిశుద్ధ్య పనులు వేగవంతమయ్యాయి. 99 రోజుల కార్యాచరణలో భాగంగా 12వ రోజు 4వ వార్డులో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టి, వ్యర్థాలను ఎప్పటికప్పుడు పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు మున్సిపాలిటీ పరిధిలో 72.99 శాతం ఆస్తి పన్ను వసూళ్లు అయినట్లు తె...

March 18, 2026 / 07:14 AM IST

‘రాజీమార్గమే రాజ మార్గం’

SRCL: రాజీమార్గమే రాజ మార్గమని సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పుష్పలత అన్నారు. సిరిసిల్లలోని కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో మంగళవారం జరిగిన సమన్వయ సమావేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కారం అవడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి విముక్తి పొందుతారని తెలిపారు.

March 18, 2026 / 07:13 AM IST

చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్‌కు PDSU వినతి

NZB: జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా CBSE పేరుతో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ చేపడుతున్నారని వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని HYDలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు PDSU బృందం వినతిపత్రం అందజేసింది. NZBకు చెందిన PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు జన్నారపు రాజేశ్వర్ పాల్గొన్నారు.

March 18, 2026 / 07:05 AM IST

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల సీజ్

వనపర్తి మండలం చిమనగుంటపల్లి సమీపంలోని తూర్పు తాండ వాటర్ ట్యాంక్ దగ్గర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను గుర్తించి ఆపి పరిశీలించారు. పరిశీలనలో ఎటువంటి అనుమతి పత్రాలు లేనందున ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై రిషికేష్ తెలిపారు.

March 18, 2026 / 07:04 AM IST

దూద్‌బౌలిలో రంజాన్ తోఫా పంపిణీ

HYD: రంజాన్ పర్వదినానికి అన్ని ఏర్పాటు చేస్తున్నామని బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. మంగళవారం దూద్‌బౌలి డివిజన్ పరిధిలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

March 18, 2026 / 07:02 AM IST

‘మేరీ మాత విగ్రహాన్ని తొలగించిన నిందితులను అరెస్టు చేయాలి’

BHNG: భువనగిరి మండలం జమ్మాపురంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న మేరీ మాత విగ్రహాన్ని తొలగించి, కింద పడేసి అవమానపరిచిన నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మతసామరస్యంతో అందరు కలిసిమెలిసి ఉంటున్న జిల్లాలో మతాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు.

March 18, 2026 / 07:01 AM IST

చండూరు ఘటనపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

NLG: జిల్లా చండూరు పట్టణంలో బీజేపీ కార్య కర్తలపై జరిగిన దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

March 18, 2026 / 07:01 AM IST