MLG: యుద్ధం కారణంగా MLG జిల్లాలో గ్యాస్ కొరత పై దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జిల్లా సివిల్ సప్లై అధికారి సయ్యద్ షా ఫైసల్ స్పష్టం చేశారు. జిల్లాలో LPG గ్యాస్ సిలిండర్ల కొరతలేదని వెల్లడించారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 18004257109 నెంబర్ను సంప్రదించాలన్నారు.