• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చిత్తూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

CTR: జిల్లా అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, పోలీసులు వాహన పత్రాలు, లైసెన్స్‌లు, హెల్మెట్ వాడకం, మద్యం తాగి వాహనాలు నడపడాన్ని తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా, ప్రజా భద్రతను, నేరాలను నిరోధించడానికి ఇంటెన్సివ్ వెహికల్ చెక్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను కూడా పర్యవేక్షిస్తున్నారు.

March 3, 2026 / 07:53 PM IST

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

మార్కాపురంలోని కందుల నారాయణ రెడ్డి సమక్షంలో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పొదిలి మండలం కుంచెపల్లి గ్రామానికి చెందిన వరికుంట్ల పౌలు, వరికుంట్ల వినోద్ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 3, 2026 / 07:52 PM IST

సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

GNTR: రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరిగిన సుదీర్ఘ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.

March 3, 2026 / 07:51 PM IST

జిల్లాలో 15 మందికి బెస్ట్ టీచర్ అవార్డులు

ఏలూరు జిల్లా బయాలజీ ఫోరం ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందించిన 15 మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానించారు. జిల్లా ఉమ్మడి పబ్లిక్ పరీక్షల కార్యదర్శి సర్వేశ్వరరావు పాల్గొని బయాలజీ ఫోరం విశిష్టతలను వివరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.గంగాధర్ ఫోరం ఆవిర్భావం, సేవలను వివరించారు.

March 3, 2026 / 07:50 PM IST

క్రీడా పాఠశాలలో ప్రవేశానికి రేపే చివరి తేదీ

KNR: కరీంనగర్‌లోని క్రీడా పాఠశాలల్లో 2026-27 విద్యా సం.కి 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదని KNR జిల్లా క్రీడాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలో 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన విద్యార్థులు tgss.telangana.gov.in చేసుకోవాలి. MAR 13 నుంచి మండల, 28 నుంచి జిల్లా,ఏప్రిల్ 27నుంచి రాష్ట్రస్థాయి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:48 PM IST

‘అటవీశాఖ దౌర్జన్యాలు తక్షణమే ఆపాలి’

MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లి ఆదివాసీలపై అటవీశాఖ దౌర్జన్యాలు తక్షణమే ఆపాలని BRS జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు. తరతరాలుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలపై అటవీ అధికారులు సాగిస్తున్న అరాచకాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఈ దాడులు నిలిపివేయాలని, లేదంటే బాధితుల పక్షాన BRS పెద్దఎత్తున పోరాటం చేస్తుందన్నారు.

March 3, 2026 / 07:48 PM IST

సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం

SRCL: పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొని, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోనీ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల చార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊయాలలో ఉంచి జోల పాటలు పాడుతూ పూజలు చేశారు. స్వామిని దర్శించుకొని భక్తులు పూజలు చేశారు.

March 3, 2026 / 07:48 PM IST

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

WGL: నర్సంపేట డివిజన్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని గౌరవాధ్యక్షుడు మన్నెం వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నిక చేశారు. అధ్యక్షుడిగా ఈదుల కృష్ణ, ఉపాధ్యక్షుడిగా జూలూరి నరేష్, ప్రధాన కార్యదర్శిగా కేశరాజు సాయికుమార్, కోశాధికారిగా భూక్య వెంకన్న, కార్యదర్శిగా ధూపటి సుమన్, సంయుక్త కార్యదర్శులుగా,ఆకుల రాజ, ఎన్నికైనట్లు తెలిపారు.

March 3, 2026 / 07:47 PM IST

కేంద్ర మంత్రితో ఎంపీ భేటీ

SKLM: ఎంపీ రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మందస పాతపట్నం స్టేషన్లలో పలు రైళ్లు నిలుపుదల కల్పించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.

March 3, 2026 / 07:47 PM IST

గోశాలను పరిశీలించిన జేఈవో

CTR: తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో డా. ఏ.శరత్ పలమనేరు గోశాలను మంగళవారం పరిశీలించారు. పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 450 ఎకరాల్లో విస్తరించిన గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నాయని తెలిపారు. పచ్చిమేత సాగును విస్తరించాలని, పరిశుభ్రత, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

March 3, 2026 / 07:45 PM IST

ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

KMM: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వరమని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్‌ అన్నారు. మండలంలోని టేకులపల్లిలో ఇందిరమ్మ ఇళ్ళను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

March 3, 2026 / 07:45 PM IST

MAR 6-JUNE 12 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు

TG: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక జరపనున్నారు.

March 3, 2026 / 07:45 PM IST

ముగిసిన గ్రహణం.. తెరిచిన ఆలయాలు

ADB: నార్నూర్ మండలంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 7 గంటలకు ముగిసింది. గ్రహణ సమయంలో సంప్రదాయాల ప్రకారం మండలంలోని పలు ఆలయాలను మూసివేశారు. భక్తులు కూడా ఇళ్లలోనే పూజలు నిర్వహించారు. గ్రహణం ముగిసిన వెంటనే శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ద్వారాలను తిరిగి తెరిచారు. భక్తుల రాకపోకలతో ఆలయాలు మళ్లీ సందడిగా మారాయి.

March 3, 2026 / 07:44 PM IST

చందోలులో వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

BPT: చందోలులో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. జీర్ణోద్ధరణ చేసిన నూతన మండపంలో అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం వివాహ వేడుకను నిర్వహించారు. నిత్య హోమం, ప్రత్యేక పూజలతో పాటు గరుడసేవ, రథోత్సవం కనులపండువగా సాగాయి. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ సాయి గుప్తా, ఈఓ నరసింహమూర్తి వెల్లడించారు.

March 3, 2026 / 07:44 PM IST

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాల వేలం: CI

నారాయణపేట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు మంగళవారం వేలంపాట నిర్వహించినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిర్వహించిన వేలంపాటలో రూ.29 వేలకు గాను, ఓ వ్యక్తి వేలం ద్వారా రూ. 68,020 వేలకు సొంతం చేసుకున్నారని సీఐ చెప్పారు. బహిరంగ వేలంపాటలో మొత్తం 20 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:44 PM IST