• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాల్పులు.. మృతుల్లో భారత సంతతి వ్యక్తి

ఇటీవల టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 21 ఏళ్ల సవితా షణ్ముగసముద్రన్‌ ఉన్నట్లు అమెరికా అధికారుల వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనికి బాధితులతో ముందే పరిచయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

March 3, 2026 / 08:26 PM IST

రసాయన రహిత ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం..!

CTR: రసాయ రహిత ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. AP రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలుదారుల మధ్య సంబంధం కోసం కుప్పంలో వ్యాపార సంబంధాల వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన పలు ఉత్పత్తులను ప్రదర్శించారు.

March 3, 2026 / 08:25 PM IST

మంత్రి పొంగులేటిని కలిసిన భద్రాద్రి కలెక్టర్

BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గడిచిన రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి సూచించారు.

March 3, 2026 / 08:25 PM IST

జిల్లా వాసికి ప్రతిష్టాత్మక అవార్డు

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ “హనుమాన్” పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక వన్యప్రాణి సంరక్షక్ అవార్డు జిల్లాకు చెందిన మూర్తి కంటి మహంతిక దక్కింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆయనని పలువురు అభినందించారు.

March 3, 2026 / 08:24 PM IST

చింతకాయల దొంగతనం,స్టేషన్లో ఫిర్యాదు

KMM: వైరా మండలం విప్పలమడక రైతు వేదిక ఆవరణలో ప్రభుత్వ చెట్టుకు చెందిన చింతకాయలు దొంగిలించబడిన ఘటన పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. మంగళవారం గ్రామ పంచాయతీ గుమస్తా ఎస్సై పవన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తిని తస్కరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.

March 3, 2026 / 08:23 PM IST

ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్

ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇవాళ, రేపు కంపెనీ ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ ఎక్స్‌ రూ.79,999(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉండనుంది. ఇదివరకు ఈ బైక్ ధర దాదాపు రూ. లక్ష వరకు ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి వివరాలు చూడవచ్చు.

March 3, 2026 / 08:23 PM IST

తప్పిన పెను ప్రమాదం.!

KRNL: పెద్దకడబూరు(మం) కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని చెరువు దగ్గర ఇవాళ సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన కురవ నాగన్న ట్రాక్టర్ మిరపపంట లోడు కోసం పొలానికి వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి ముళ్లకంపలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదవశాత్తు ఎవరికీ ఏమికాలేదు. స్థానికులు మరో ట్రాక్టర్ సాయంతో బోల్తా పడిన ట్రాక్టర్‌ను బయటకు తీశారు.

March 3, 2026 / 08:22 PM IST

హుజురాబాద్ అభివృద్ధిపై ఛైర్ పర్సన్‌తో SE చర్చలు

KNR: హుజూరాబాద్ అభివృద్ధిపై ఛైర్ పర్సన్ తో ఎస్ఈ సుధీర్గంగా చర్చించారు.హుజూరాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఎన్నికైన రొంటాల సుహాసినిని మంచిర్యాల జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) కండె రవీందర్ కలిశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రజా సమస్యలపై వారు చర్చించారు. ముఖ్యంగా 29, 30 వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.

March 3, 2026 / 08:21 PM IST

చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ‘2026 లారస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు టీమిండియా నామినేట్ అయింది. క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారంగా ఈ అవార్డ్‌ను పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్ల మధ్య ఈ పోటీ ఉంటుంది. విజేతను ఏప్రిల్‌లో ప్రకటిస్తారు.

March 3, 2026 / 08:18 PM IST

మదనపల్లెలో జనసేన సభ్యత్వ శిబిరం

అన్నమయ్య: మదనపల్లి సంతపేటలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం శిబిరాన్ని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ ప్రారంభించారు. రూ.400తో సభ్యత్వ నమోదు చేసి రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందాలని నాయకులు పిలుపునిచ్చారు.

March 3, 2026 / 08:17 PM IST

తెరుచుకున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కొద్దిసేపటి క్రితం ఆలయ అర్చకులు తెరిచారు. ఆలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా అర్చకులు ఏకాంత సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం నుంచి మూసివేసిన ఆలయాన్ని రాత్రి తెరిచారు. గ్రహణం ముగిసి న అనంతరం 7.16 గంటలకు పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 3, 2026 / 08:16 PM IST

ఆర్టీసీ కండక్టర్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం

ADB: ఉట్నూర్ ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న వేముల ఉషన్న అనారోగ్యంతో హైదరాబాదులోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయన అంత్యక్రియల కోసం సంస్థ తరఫున దహన సంస్కారాల నిమిత్తం రూ. 30 వేల నగదును డిపో క్యాషియర్ చంద్రశేఖర్ మృతుని స్వగ్రామం ఇంద్రవెల్లి మండలం కేస్లాగూడ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులకు అందజేశారు.

March 3, 2026 / 08:14 PM IST

గన్నవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని పి. నైనవరంలో ఏపీ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా నూతన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై 455 మంది రైతులకు పాస్‌ పుస్తకాలు అందజేశారు. గత ప్రభుత్వం రైతుల పాస్‌ పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రించడం తప్పని విమర్శించారు.

March 3, 2026 / 08:14 PM IST

కూతురిని చంపిన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాకినాడ: చిన్నారి మృతికి కారణమైన తండ్రిని జగ్గంపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గత నెల 26న ఒడిమని మణికంఠ మద్యం మత్తులో తన భార్య సాయమ్మతో గొడవపడి ఇంట్లో నిద్రిస్తున్న 11 నెలల కూతురిని స్కూటీపై ఎక్కించుకుని గుర్రప్పాలెం రోడ్లో ఉన్న పోలవరం కాలువలో దూకడంతో చిన్నారి మృతి చెందింది. దీనిపై స్పందించిన పోలీసులు చిన్నారి మృతికి కారణమైన మణికంఠను అరెస్టు చేశారు.

March 3, 2026 / 08:14 PM IST

‘హోలీ పండగ ప్రజల జీవితాల్లో నింపాలి’

PPM: జిల్లా ప్రజలకు, అధికారులకు, కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ‘హోలీ’ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఈ పండుగ సోదర భావానికి, స్నేహానికి చిహ్నమని ఆయన పేర్కొన్నారు. పండుగను అందరితో కలసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వసంత కాలపు రాకను హోలీ పండగని గుర్తు చేశారు.

March 3, 2026 / 08:13 PM IST