• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

T20 WC నాకౌట్స్.. RO-KOవే రికార్డ్స్

T20 WC నాకౌట్స్ రౌండ్‌లో అత్యధికంగా 373 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 6 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించగా.. రోహిత్(8 మ్యాచుల్లో 227), బట్లర్(6లో 226) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ రౌండ్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డ్(5) కోహ్లీ పేరిట ఉండగా.. అత్యధిక మ్యాచులాడిన ఆటగాడిగా రోహిత్(8) కొనసాగుతున్నాడు.

March 4, 2026 / 07:22 AM IST

అరుదైన గర్భాశయ ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స విజయవంతం

SDPT: జిల్లా గజ్వేల్ ఆసుపత్రిలో 43 ఏళ్ల మహిళకు అరుదైన గర్భాశయ ఫైబ్రాయిడ్ (లియోమయోమస్) శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. గర్భాశయ కండర గోడలలో పెరిగిన 24 వారాల పరిమాణంలో ఉన్న 13/11/10 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్‌ను వైద్యులు తొలగించారు. ఈ శస్త్ర చికిత్సను డాక్టర్ త్రివేణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రేమ్ కిషోర్, అనస్థీషియా డాక్టర్ మైపాల్ తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:21 AM IST

RTI సొసైటీ జిల్లా లీగల్ అడ్వైజర్ గా ధీరజ్ భౌమిక్

ASF: సమాచార హక్కు రక్షణ చట్టం-2005 సొసైటీ ఆసిఫాబాద్ జిల్లా లీగల్ అడ్వైజర్‌గా కాగజ్ నగర్‌కు చెందిన న్యాయవాది ధీరజ్ భౌమిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కొండగుర్ల కమలాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ధీరజ్ మాట్లాడుతూ.. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సొసైటీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

March 4, 2026 / 07:21 AM IST

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” సమీక్షలో పాల్గొన్న మంత్రి

MGL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ధనుసరి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆమె సూచించారు.

March 4, 2026 / 07:20 AM IST

మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

KMM: సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య సతీమణి రుక్మిణమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. 1977-81 మధ్య ఎమ్మెల్యేగా సేవలందించిన సీతారామయ్య కుటుంబంలో ఈ మృతి విషాదం నింపింది. ఏన్కూర్ మండలం బీఆరపురం గ్రామంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించి సానుభూతి తెలిపారు.

March 4, 2026 / 07:20 AM IST

టమాటా ధరల పతనం..ఆందోళనలో రైతులు

GNTR: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. గతంలో కిలో రూ.50 వరకు పలకగా, ప్రస్తుతం తెనాలి మార్కెట్‌లో ధర రూ.10కి పడిపోయింది. హోల్‌సేల్ మార్కెట్‌లో కేవలం రూ.8కే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి భారీగా పెరగడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 07:16 AM IST

ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

JN: జిల్లా కేంద్రంలో మంగళవారం ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌ను టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు మరాఠీ దినేష్, బాల్దే బానుష్‌గా గుర్తించారు. టాటా ఏసీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

March 4, 2026 / 07:15 AM IST

నేడు ఢిల్లీకి రేవంత్, మహేష్ గౌడ్

TG: రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానంతో భేటీ అయి తుది పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించినట్లు సమాచారం. రెండో స్థానం కోసం పలువురు రాష్ట్ర నేతలు పోటీ పడుతుండగా, సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక ఉండనుంది.

March 4, 2026 / 07:15 AM IST

ఇద్దరినీ కాపాడి మరో వ్యక్తి గల్లంతు

BDK: మణుగూరు మండలంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా పద్మగూడెంకు చెందిన పదిమంది మంగళవారం మల్లేపల్లి గోదావరి నది ఒడ్డుకు వచ్చారు. అక్కడే వంటలు చేసుకుని సరదాగా గోదావరి ఒడ్డున ఈత కొడుతుండగా ముగ్గురు ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగిపోతుండగా పద్దం ప్రసాద్ ఇద్దరిని కాపాడి, మరో వ్యక్తి నాగేశ్వరరావును కాపాడబోయి గల్లంతయ్యాడని తెలిపారు.

March 4, 2026 / 07:13 AM IST

తిరుమల TTDలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

తిరుమల తిరుపతి దేవస్థానాలు(TTD) ఆస్పత్రుల్లో 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఇవాళ ఇంటర్వ్యూ జరగనుంది. MBBS/MS/MDలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అర్హులు. తిరుపతిలోని సెంట్రల్ హాస్పిటల్‌లో ఇంటర్వ్యూ జరగనుండగా.. ఎంపికైనవారికి నెలకు రూ.53,495 జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

March 4, 2026 / 07:12 AM IST

నేడు అల్లూరి, విశాఖ జిల్లాల్లో జగన్ పర్యటన

AP: మాజీ సీఎం జగన్ ఈరోజు అల్లూరి, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్లనున్నారు. ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను జగన్ ఆశీర్వదించనున్నారు.

March 4, 2026 / 07:12 AM IST

నారా లోకేష్ ఆత్మీయ విందులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు: అమరావతి, ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ ఆహ్వానం మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ అందించిన ఆత్మీయ స్వాగతం, చూపించిన ప్రేమాభిమానాలు తమను ఎంతో హత్తుకున్నాయన్నారు.

March 4, 2026 / 07:12 AM IST

నిరుద్యోగులకు APMSRB హెచ్చరిక

AP: ఎవరైనా మధ్యవర్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీలు ఇస్తే నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల నియామక బోర్డు(APMSRB) హెచ్చరించింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసపూరిత కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బోర్డు నిర్వహించే అన్ని నియామకాలు రిజర్వేషన్ నిబంధనలు, మెరిట్ ఆధారంగా జరుగుతాయని వెల్లడించింది.

March 4, 2026 / 07:07 AM IST

ఈనెల 6న జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్

MNCL: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా ప్రకటనలో తెలిపారు. ‘ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు- భారత ప్రజాస్వామ్యానికి పాఠాలు’ అనే అంశంపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 9963104959 నెం.లో సంప్రదించాలన్నారు.

March 4, 2026 / 07:05 AM IST

నేడు మంచినీటి సరఫరా బంద్

TPT: గూడూరు 2వ పట్టణ పరిధిలో రాపూరు రోడ్డులో మాసు వద్ద ఉన్న నీటి సరఫరా పైప్‌లైన్ దెబ్బతినడంతో బుధవారం ఒకటవ పట్టణ పరిధిలో మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. యథాతథంగా గురువారం పట్టణంలో మంచినీటి సరఫరా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 07:03 AM IST