• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆమనగల్లులో వైభవంగా అగ్నిగుండాలు

NLG: వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 5:50 గంటలకు నందీశ్వరుని అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ‘ఓం నమశ్శివాయ’ స్మరణతో అగ్నిగుండం దాటి మొక్కులు తీర్చుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 4, 2026 / 08:05 AM IST

జనసేన కార్యాలయంలో దాడి.. నిందితుడి అరెస్టు

AP: మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రి అనే వ్యక్తి జనసేన కార్యాలయంలో భద్రతా సిబ్బంది కార్లు రెండింటిని ధ్వంసం చేశాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరాస్వామి తెలిపారు. నిందితుడిని మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిందని చెప్పారు.

March 4, 2026 / 08:04 AM IST

నేడు అగ్నిగుండ మహోత్సవం

TPT: పెరిమిడి పాండురంగస్వామి ఆలయం వద్ద 84వ సంవత్సర ఆనంద అగ్నిగుండ మహోత్సవాన్ని ఇవాళ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రతి ఏటా పలుణ మాసం పౌర్ణమి నాడు నిర్వహించే ఈ వేడుకలను ఆదివారం సంప్రదాయ బద్ధంగా ప్రారంభించారు. సోమవారం ధ్వజారోహణ, మంగళవారం కంకణ ధారణ నిర్వహించనట్లు తెలిపారు.

March 4, 2026 / 08:02 AM IST

గ్రహణం సందర్భంగా రోట్లో నిలిచిన రోకలి బండ

SRPT: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన చాగంటి మహిత చంద్రగ్రహణం సమయంలో సాయంత్రం 5.30 నిమిషాల సమయంలో ఇంటిలోని రోటిలో నీళ్లు పోసి రోకలి బండను అందులో నెలపగా నిలబడెను దాన్ని చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. మామూలు సమయాలలో ఎంత నిలిపిన నిలవని రోకలి బండ గ్రహణం సమయములో నిలబడటం పెద్దలకు ఆశ్చర్యానికి కలిగించింది.

March 4, 2026 / 08:02 AM IST

కొండాపూర్ గ్రామంలో నేడు కుస్తీ పోటీలు

KMR: కొండాపూర్ గ్రామంలో నేడు నిర్వహించనున్న కుస్తీ పోటీల విజేతకు రూ.2,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు పంచాయతీ కార్యదర్శి జరుపుల జైల్ సింగ్ తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

March 4, 2026 / 08:01 AM IST

ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు

MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో శవాన్ని పోస్టుమార్టం కోసం ఉంచగా, కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు, మంగళవారం నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ చంద్రకళ, ఆర్ఎంవో హరినాథ్, ఎంఎవో రవి ప్రకాష్, డ్యూటీ డాక్టర్ మునిషాలను సస్పెండ్ చేశారు.

March 4, 2026 / 08:01 AM IST

విదుర నీతి: ఈ గాయం జీవితాంతం మానదు

చెట్లను గొడ్డలితో నరికినా మళ్లీ చిగురిస్తాయి. ఆయుధాలతో శరీరానికి తగిలిన గాయాలైనా మానుతాయి. కానీ, కఠినమైన మాటలతో మనస్సుపై చేసిన గాయం ఎప్పటికీ మానదని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పారు. శారీరక గాయాల కంటే మానసిక గాయాలు చాలా లోతైనవి. ఆ మాటలు జీవితాంతం బాధిస్తాయి కాబట్టి, ఇతరులతో మాట్లాడేటప్పుడు పదాలను చాలా జాగ్రత్తగా, ఆచితూచి వాడాలని విదుర నీతి సారాంశం.

March 4, 2026 / 08:00 AM IST

గన్నవరంలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

కృష్ణా: గన్నవరం మండలం చిక్కవరంలో పండగపూట విషాద చోటుచేసుకుంది. హోలీ ఆడి చేతులు కడుగుకునేందుకు చెరువు వద్దకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడటంతో మృతి చెందారు. మృతులు దుప్పల నవీన్ కుమార్ (11), వెంకట జోసఫ్ (16), సాయి (16)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 4, 2026 / 07:57 AM IST

ప్రపంచ మేధావి అంబేద్కర్: జూపూడి

VZM: భారత దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేసిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. జొన్నవలస గ్రామంలో జిల్లా దళిత సమ్మేళన సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లోగిశ రామకృష్ణ పాల్గొన్నారు.

March 4, 2026 / 07:56 AM IST

తిరుమలలో చిరుత సంచారం

AP: తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరిలో తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత దాడిలో జింక మృతిచెందింది. దీంతో భక్తులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం చేశారు. 

March 4, 2026 / 07:55 AM IST

దుర్గం గ్రామంలో తీవ్ర త్రాగునీటి ఎద్దడి..!

ASR: పెదబయలు మండలం జామిగూడ పంచాయతీ దుర్గం గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సదుపాయాలు లేక ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి కాలువల్లోని కలుషిత నీటినే వాడుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనివల్ల మహిళలు, వృద్ధులు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వేసవిలో ఈ కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి సురక్షిత త్రాగునీరు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 4, 2026 / 07:55 AM IST

జూనియర్ Vs సీనియర్.. టీయూలో అర్ధరాత్రి దాడులు

TG: కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీలో హోలీ సంబరాలు ఉద్రిక్తతకు దారితీశాయి. నిన్న అర్ధరాత్రి బాలుర వసతి గృహంలో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య మొదలైన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకోవడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అధికారులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

March 4, 2026 / 07:55 AM IST

జిల్లా రీజనల్ కోఆర్డినేటర్‌గా బొత్సకి చోటు

E.G: వైసీపీ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్లను మంగళవారం నియమించింది. ఈ మేరకు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. తూ.గో జిల్లా వైసీపీ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించిoది. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తానన్నారు.

March 4, 2026 / 07:54 AM IST

మైనర్ బాలికపై అత్యాచారం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులునాయుడుపాలెంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 24న బాలికను ప్రలోభపెట్టి, బెదిరింపులకు గురిచేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకుని, వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

March 4, 2026 / 07:52 AM IST

IND vs ENG సెమీస్: ‘అన్నీ సుపరిచిత వ్యూహాలే’

T20 WCలో భారత్, ఇంగ్లండ్ వరుసగా 3వ సారి సెమీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరస్పరం సంధించుకునేందుకు రహస్య ఆస్త్రాలేమీ లేవని, ఎవరి వ్యూహాలు ఏంటనేది ఇరుజట్లకూ తెలుసని ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్ పేర్కొన్నాడు. రేపు వాంఖడేలో భారత్‌పై విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్తామని ధీమా వ్యక్తంచేశాడు. అభిషేక్ కోసం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

March 4, 2026 / 07:52 AM IST