• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నిలకడగా హనుమంతరాయ చౌదరి ఆరోగ్య పరిస్థితి

ATP: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలోని సవీర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఆరోగ్య సూచీలు స్థిరంగా ఉన్నాయని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని వైద్య బృందం వెల్లడించింది.

March 4, 2026 / 06:27 AM IST

‘మహిళలు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలి’

NTR: విజయవాడలోని ఏపీ ఐఐసీ కాలనీలోని తులసమ్మ కళ్యాణ మండపంలో డ్వాక్రా మహిళలకు రూ.4 కోట్ల రుణం చెక్కును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, మహిళలు తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

March 4, 2026 / 06:27 AM IST

చెరువులో చెత్త డంపింగ్..!

SKLM: నరసన్నపేటలోని గుండవల్లిపేట సమీపంలో ఉన్న చెరువులో గ్రామాల్లో సేకరించిన చెత్తను డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుండవల్లిపేట, రావుల వలస గ్రామాల నుంచి సేకరించిన చెత్తను చెరువులో వేయడంతో నీరు కలుషితం అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువులో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

March 4, 2026 / 06:27 AM IST

39 బస్తాలు అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

కాకినాడ నుంచి ద్రాక్షారామం తరలిస్తున్న రెండు ఆటోలను తనిఖీ చేసిన కరప ఎస్ఐ సునీత 39 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,87,860గా నిర్ధారించారు. బియ్యం, ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

March 4, 2026 / 06:27 AM IST

కార్యకర్తను పరామర్శించిన MLA

PLD: గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురజాల మండలం తేలుకుట్ల బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం పరామర్శించారు. దాడిలో గాయపడిన ఏడుకొండలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. “పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం, వైసీపీ దాడులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు” అని ఆయన ధైర్యం చెప్పారు.

March 4, 2026 / 06:26 AM IST

నేడు నాంచారమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు

GNTR: చేబ్రోలు మండలం శలపాడులో నేడు, రేపు శ్రీ నాంచారమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం భారీ అన్నదానంతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.

March 4, 2026 / 06:25 AM IST

ఓటరు జాబితాలను పరిశీలించిన జిల్లా DLDO

PPM: ఓటర్‌ జాబితా త్వరతిగతిన సిద్ధం చెయ్యాలని DLDO రమేశ్‌ రామన్‌ సూచించారు. మంగళవారం పాచిపెంట MPDO కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు సిద్ధం చేస్తున్న ఓటర్‌ జాబితాలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, గ్రామాల వారిగా జాబితా పక్కగా ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఆదేశాంచారు.

March 4, 2026 / 06:25 AM IST

నేడు విశాఖ కాకినాడ పోర్టు రైలు రద్దు

విశాఖ-కాకినాడ పోర్టు-విశాఖ పాసింజర్ మెము రైలును బుధవారం రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈ రైలు అనకాపల్లి, ఎలమంచిలి నర్సీపట్నం రోడ్డు మీదుగా నడుస్తుంది. భద్రత పనుల కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

March 4, 2026 / 06:25 AM IST

‘శర వేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్ పోర్ట్’

SKLM: రాష్ట్రంలో నిర్మితమవుతున్న విజయవాడ విమానాశ్రయ టెర్మినల్, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు డిల్లీలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శర వేగంగా భోగాపురం, విజయవాడ విమానాశ్రయాల నిర్మాణం పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. సమావేశంలో ఆయన కీలక సూచనలు చేసారు.

March 4, 2026 / 06:24 AM IST

బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బీర్ల

BHNG: మరికొద్ది రోజుల్లో సాగునీటి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఆలేరు మండలం కొలనుపాక సమీపంలో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి పనులు, అలాగే రాజపేట మండలం కాల్వపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను ఆయన ప్రత్యక్షంగా సందర్శించి పురోగతిని సమీక్షించారు.

March 4, 2026 / 06:24 AM IST

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

PDPL: విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ గోదావరిఖని శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి పట్టణంలో హోలీ పండుగ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు అయోధ్య రవీందర్ హోలీ ప్రాముఖ్యతను హిందూ బంధువులకు వివరించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సంపత్, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 06:23 AM IST

సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

RR: మాడ్గుల మండలం అవురుపల్లిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి నిధులు కేటాయించాలని MLA కసిరెడ్డి నారాయణరెడ్డికి మంగళవారం గ్రామస్తులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో 24 గంటల కరెంటు ఉండడం లేదని, అంతర్గత సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించి ఆదుకోవాలని కోరారు.

March 4, 2026 / 06:23 AM IST

మైదుకూరులో ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు దాడులు

కడప జిల్లా విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం రాత్రి మైదుకూరులో దాడులు చేసి PDSకు చెందిన 57 బస్తాల బియ్యం, 91 బస్తాల జొన్నలు, 6 బస్తాల రాగులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, పాఠశాలల మధ్యాహ్నం భోజనం, అంగన్వాడీలు సంక్షేమ హాస్టళ్ళ ముద్ర కలిగిన అన్ని బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

March 4, 2026 / 06:22 AM IST

రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన డీఎస్పీ

BPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ చీరాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చీరాల డీఎస్పీ మోయిన్ స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు రక్తాన్ని అందుబాటులో ఉంచడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 06:20 AM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికీ తీవ్ర గాయాలు

తూ.గో: సీతానగరం మండలం శ్రీరామనగరం చిట్టిబాబాజీ ఆశ్రమం వద్ద మంగళవారం సాయంత్రం 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రఘుదేవపురం పంచాయతీ కంచుమర్తి వారిపేటకు చెందిన మత్తాల స్టీఫెన్ ఆనంద్ (15) నడుపుతున్న బైకు రాపాకకు చెందిన దంపతుల వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 4, 2026 / 06:19 AM IST