తూ.గో: సీతానగరం మండలం శ్రీరామనగరం చిట్టిబాబాజీ ఆశ్రమం వద్ద మంగళవారం సాయంత్రం 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రఘుదేవపురం పంచాయతీ కంచుమర్తి వారిపేటకు చెందిన మత్తాల స్టీఫెన్ ఆనంద్ (15) నడుపుతున్న బైకు రాపాకకు చెందిన దంపతుల వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.