• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కరీంనగర్ కార్పొరేటర్‌కు సన్మానం

PDPL: ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన భాస్కర్ నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ ధర్మారం వచ్చిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు భాస్కర్ నాయక్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు కొమురయ్య, రంజిత్, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

March 4, 2026 / 12:21 PM IST

హోలీ వేడుకల్లో మీడియా ప్రతినిధుల సందడి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా రోజు వార్తల్లో నిమగ్నమై ప్రజలకు నిత్యం వార్త సమాచారాన్ని అందించే మీడియా ప్రతినిధులు హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ ఎస్సై లక్ష్మారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి హోలీ శుభాకాంక్షలు మీడియా ప్రతినిధులు తెలియజేశారు.

March 4, 2026 / 12:20 PM IST

డ్వాక్రా మహిళలకు సర్కార్ బంపర్ ఆఫర్

TG: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం సరికొత్త బీమా పథకాన్ని ప్రకటించింది. రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే, ఆ అప్పును కుటుంబం లేదా సంఘం సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.10 లక్షల వరకు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. మంత్రి సీతక్క ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో పాటు మహిళలకు రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా అందనుంది.

March 4, 2026 / 12:20 PM IST

ఏర్పాట్లను పర్యవేక్షించిన డీసీపీ

WGL: కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏర్పాట్లను DCP అంకిత్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ వివాదాల దృష్ట్యా ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతలను కాపాడాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 4, 2026 / 12:20 PM IST

చెరుకు తోట పరిశీలించిన అధికారులు

CTR: ఎస్ఆర్ పురం మండలం మిట్ట కండ్రిగలో అగ్ని ప్రమాదంలో చెరుకు తోట, గానుగ షెడ్ దగ్ధం అయిన సంగతి తెలిసిందే. బుధవారం రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రైతు నవీన్‌ను సంఘటనపై ఆరా తీశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపి.. రైతుకు న్యాయం చేస్తామని అధికారులు తెలియజేశారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 4, 2026 / 12:17 PM IST

హోళీ పండగను ఎందుకు జరుపుకుంటారు?

హోళీ రోజున అందరూ ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. వాస్తవానికి హోళీ అంటే ఇలా రంగులు పుసుకోవడమే కాదు. ఇది చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా, వసంతకాల రాకను ఆహ్వానిస్తూ జరుపుకునే పండగ. పాత గొడవలను మర్చిపోయి, అందరూ స్నేహంగా రంగులతో ప్రేమను పంచుకుంటారు. అందుకే ఈ రోజున చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ బంధువులు, సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు.

March 4, 2026 / 12:17 PM IST

మల్యాల గ్రామంలో మంచినీటి కోసం గ్రామసభ

BHNG: బొమ్మలరామారం మండలంలోని మల్యాల గ్రామంలో బుధవారం సర్పంచ్ దొమ్మట రమాదేవి శంకర్, ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో సర్పంచ్ గ్రామానికి మంచినీరు, పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

March 4, 2026 / 12:15 PM IST

పాఠశాలలో ఘనంగా హోలీ పండగ

NGKL: లింగాల మండలం కొత్తకుంటపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో హోలీ పండుగను పురస్కరించుకొని, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ‘హోలీ సంబరాలను’ అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ అంతా రంగులమయంగా మారి, పండుగ వాతావరణం సంతరించుకుంది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి జరుపుకునే ఈ పండుగ విద్యార్థుల్లో స్నేహభావం, ఐక్యతను పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు.

March 4, 2026 / 12:15 PM IST

హోలీ వేడుకల్లో పాల్గొన్న రాకేష్ రెడ్డి

HNK: BRS రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి హోలీ వేడుకలు జరుపుకున్నారు. హనుమకొండ నగరంలోని తన నివాసంలో BRS కార్యకర్తలు, తన అనుచరులు, అభిమానులతో కలిసి ఆయన వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, రంగులు కలిపిన నీళ్లు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

March 4, 2026 / 12:15 PM IST

వైన్ షాప్ తొలగించాలని విద్యార్థులు ధర్నా

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల వైన్ షాపును తొలగించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం వైన్ షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి, వైన్ షాప్‌ను తొలగించాలని PDSU జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యాపారస్తులు, ప్రజలు వైన్ షాప్‌ను తొలగించాలని జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

March 4, 2026 / 12:14 PM IST

ఎట్టకేలకు అంగన్వాడీ నిర్మాణ పనులు ముందుకు

VKB: కొడంగల్ మండలం అంగడిరైచూర్ జీపీ పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో ఎట్టకేలకు అంగన్వాడీ భవనం పునర్నిర్మాణం దిశగా సాగుతోంది. కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులు నేడు కార్యరూపం దాల్చడంతో వడివడిగా పనులు సాగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 12:13 PM IST

ఈ నెల 8 నుంచి ముత్యాలమ్మ తీర్థ మహోత్సవాలు

VZM: కొత్తపేట, కుమ్మరివీధిలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ, శ్రీ పోతురాజు స్వామివారి 74వ వార్షిక తీర్ధ మహోత్సవములు ఈ నెల 8 నుంచి 12 వరకు జరుగునని ఆలయ కమిటీ సభ్యులు మద్దాల సత్యారావు తెలిపారు. ఈ మేరకు అమ్మవారి నేత్రోత్సవం, అభిషేకాలు, కుంకుమ అర్చనలు, ఘటాలు, అమ్మవారి సారె ఊరేగింపు, చిత్ర విచిత్రమైన వేషధారణ, అన్నసమారాధన ఉంటాయాన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరారు.

March 4, 2026 / 12:12 PM IST

చెరువులు, పార్కులకు మహర్దశ: మొల్లి పెంటిరాజు

VSP: గాజువాక నియోజకవర్గంలో చెరువులు, పార్కుల సుందరీకరణకు త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు తెలిపారు. బుధవారం జీవీఎంసీ 86వ వార్డులోని రావుల చెరువు, లక్కరాజుపాలెం చెరువు, రాజీవ్ నగర్, మాతృశ్రీ లేఅవుట్ పార్కులను పరిశీలించారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో అభివృద్ధి చేపడతామన్నారు.

March 4, 2026 / 12:12 PM IST

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

TG: రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయి పేర్లను ఫైనలైజ్ చేయనున్నారు. ఇప్పటికే ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించగా, రెండో స్థానం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. సామాజిక సమీకరణల ఆధారంగా సాయంత్రానికి రెండో అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

March 4, 2026 / 12:11 PM IST

‘సలార్ 2’పై నిర్మాత కీలక ప్రకటన

‘సలార్ 2’పై నిర్మాత విజయ్ కిరగందూర్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని, మొదటి భాగం రూ. 700 కోట్లు వసూలు చేయడంతో రెండో భాగాన్ని అత్యంత భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ క్వాలిటీ విషయంలో రాజీపడరని, అందుకే కొంత ఆలస్యమైందని స్పష్టం చేశాడు. ప్రభాస్-హోంబలే ఫిల్మ్స్ డీల్‌లో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది.

March 4, 2026 / 12:10 PM IST