ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల వైన్ షాపును తొలగించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం వైన్ షాప్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి, వైన్ షాప్ను తొలగించాలని PDSU జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యాపారస్తులు, ప్రజలు వైన్ షాప్ను తొలగించాలని జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.