SDPT: బెజ్జంకి మండలంలోని రామసాగరం గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో మంజూరైన రూ.10 లక్షలతో ఫీడర్ ఛానల్ నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ఇంగాల నాగలక్ష్మి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కాలువతో సాగునీటి పంపిణీ సక్రమంగా జరిగి రైతులకు మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వీరేశం, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
NRPT: దండు గ్రామం నుంచి సత్యారం వరకు బుధవారం బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు కొత్త రహదారితో ఇబ్బందులు తీరనున్నాయి. ఈ రహదారి ప్రారంభంతో ప్రయాణికులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. కొత్త రహదారి మంజూరు చేయడంతో దండు, సత్యారం గ్రామ ప్రజలు మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.
AKP: నాతవరం మండలం చమ్మచింత సబ్ సెంటర్లో బుధవారం చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం జీ.కుమారి, అంగన్వాడీ, ఆశా కార్యకర్తల పర్యవేక్షణలో 0-5 ఏళ్ల చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, టీకాలు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారు వివరించారు.
MHBD: విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కనకదుర్గమ్మ తల్లిని ప్రార్ధించినట్లు తెలిపారు.
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం అలమాజి పేట పంప్ హౌస్ వద్ద ఉన్న బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఈ కారణంగా మార్చి 5 నుంచి మార్చి 11 వరకు రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి బుధవారం ప్రకటనలో తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అవసరానికి మించి వృథా చేయవద్దని కోరారు.
NLG: దేవరకొండ తాలుకా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మాజీ MLA కామ్రేడ్ పల్లా పర్వత్ రెడ్డి 29వ వర్ధంతి సందర్బంగా బుధవారం పట్టణంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దేవరకొండ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై అనేక పోరాటాలు చేశారన్నారు.
JN: చిల్పూరు మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో నెలకొన్న సమస్యలపై DPR సిద్ధం చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేస్తామని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నేడు చిన్నపెండ్యాలను కౌన్సిల్ మెంబర్ సందర్శించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో భేటీ అయి గ్రామ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
TG: రాష్ట్రంలో భర్తీ కాబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఒక సీటును మాదిగలకు కేటాయించాలని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ మాదిగలకు అన్యాయం జరిగిందని, CWCలోనూ ప్రాతినిధ్యం లేదని విమర్శించారు. పార్లమెంట్‌లో మాదిగలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
భారత బౌలర్ బుమ్రా కీలక మైలురాయికి ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 234, వన్డేల్లో 149, T20ల్లో 116 వికెట్లు పడగొట్టిన అతను.. రేపు ఇంగ్లండ్‌పై ఒక్కరినీ ఔట్ చేసినా, భారత్ తరఫున 500 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలుస్తాడు. కుంబ్లే(953), అశ్విన్(765), హర్భజన్(707), కపిల్(687), రవీంద్ర జడేజా(634), జహీర్(597), శ్రీనాథ్(551) ఇప్పటికే ఈ క్లబ్‌లో ఉన్నారు.
సీనియర్ నటి పావలా శ్యామల ఆర్థిక కష్టాల్లో ఉన్నారనే విషయం తెలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే స్పందించాడు. ఆమె కుటుంబ దీనస్థితిని చూసి చలించిన ఆయన, శ్యామల , ఆమె కుమార్తె నిత్యావసరాలు, వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందేలా శాశ్వత ఏర్పాట్లు చేశాడు. కష్టాల్లో ఉన్న తోటి కళాకారిణికి అండగా నిలిచి బన్నీ తన ఉదారతను చాటుకున్నాడు.
NZB: డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో మొదటి విడతగా 13 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు సర్పంచ్ కోట్ల భాస్కర్ తెలిపారు. రెండో విడతలో 40 ఇళ్లు మంజూరు చేయాలని రూరల్ ఎమ్మల్యే భూపతి రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం సత్తురి సావిత్రి భర్తకి ఇంటి మంజూరు పత్రాల్ని పంచాయతీ సెక్రటరీ వసంత్ రావుతో కలిసి అందజేశారు.
AP: కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై ప్రభుత్వం ప్రదర్శించిన తీరు అత్యంత హేయమని అన్నారు. అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా, అక్రమంగా అరెస్టులు చేశారని దుయ్యబట్టారు. మహిళలని చూడకుండా వారిపై లాఠీఛార్జీ చేసి, అత్యంత అమానవీయంగా వ్యవహరించారని మండిపడ్డారు.
NDL: బనగానపల్లె(మం) మిట్టపల్లిలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ టీడీపీ నాయకుడు రామసుబ్బారెడ్డి కుమార్తె వివాహ ముహూర్తపు వేడుకలో బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
VSP: సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. 12,149 కట్టడాల క్రమబద్ధీకరణ ద్వారా వేలాది కుటుంబాలకు ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
SKLM: జలుమూరు మండలంలో ఉన్న అంగనవాడీ కార్యకర్తలు బుధవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ప్రీ ఫైనల్ పరీక్షలు రాశారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఈ పరీక్షలు నిర్వహించినట్లు వెల్ఫేర్ అసిస్టెంట్ శివకుమార్ తెలిపారు. శత శాతం అక్షరాస్యత సాధనలో భాగంగా ప్రభుత్వం ఆదేశం మేరకు నిర్వహించినట్లు తెలిపారు.