• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక పరిశీలన

GDWL: మానవపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సరిగా తనిఖీ చేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి గర్భిణీకి సురక్షితమైన సాధారణ ప్రసవాలు జరగాలని అధికారులు జాగ్రత్తగా చూడాలని ఆమె సిబ్బందికి ఆదేశించారు.

March 4, 2026 / 05:20 PM IST

చోరీ కోసం వచ్చి అనంతలోకాలకు

సత్యసాయి: ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో చోరీకి ప్రయత్నించిన దొంగ మృతి చెందాడు. బళ్లారికి చెందిన నారాయణస్వామి మరో ఇద్దరితో కలిసి తాళం వేసిన ఇంట్లోకి చొరబడగా, స్థానికులు వెంబడించారు. పారిపోతూ రైల్వే ట్రాక్ వద్ద కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు.

March 4, 2026 / 05:20 PM IST

కంటేరు వాగులో మహిళ మృతదేహం లభ్యం

ప్రకాశం: పొదిలి మండలం బుచ్చన్నపాలెం గ్రామ సమీపంలోని పల్లె కంటేరు వాగులో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పక్కనే పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు మొదట పొలాల్లో ఉండే దిష్టిబొమ్మగా భావించారు. అనంతరం దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

March 4, 2026 / 05:20 PM IST

‘సోలార్ వలన ఎవరికి లాభం.. ఎవరికి నష్టం’

PPM: జిల్లాలో జోరుగా సోలార్ నిర్మాణాలు జరిగాయి కానీ దాని వలన వినియోగదారునికి ఏమేరకు లాభం వచ్చిందో ఎవరికి తెలియదని సీపీఐ కార్యవర్గ సభ్యులు RVS కుమార్ అన్నారు. త్రీ కెవిలోడు మీటర్లను పెట్టి మీరు వాడిన కరెంటు మినహాయించి మిగిలిన దానికి డబ్బులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తాయని చెప్పి వినియోగదారుడికి శఠకోపంపెట్టారని విమర్శలు వస్తున్నాయన్నారు.

March 4, 2026 / 05:17 PM IST

‘మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి’

W.G: తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనంలో బుధవారం రుణమేళా, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూనియన్ బ్యాంక్ కౌన్సిలర్ రాజేశ్ బాబు సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఎస్తేరు రాణి, జీ. బేబీ, శ్రీదేవి, సీసీలు సునీత పాల్గొన్నారు.

March 4, 2026 / 05:17 PM IST

కొలికపూడిపై పల్లా శ్రీనివాస్ ఫైర్

AP: MLA కొలికపూడిపై TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ‘కొలికపూడి తనకు తాను గొప్పగా ఊహించుకుంటున్నారు. ఆయనకు చివరి వార్నింగ్ అయిపోయింది, మళ్లీ పిలిచి మాట్లాడబోం. వ్యక్తిగత ఇమేజ్‌తో ఎవరూ గెలవరు, ఇది కొలికపూడికి అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీలో కొలికపూడికి చెప్పాను. తప్పైందని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని చెప్పారు’ అని పేర్కొన్నారు.

March 4, 2026 / 05:16 PM IST

డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్లు పంపిణీ

VZM: గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చీపురుపల్లి వెలుగు కార్యాలయం వద్ద బుధవారం పెరటికోళ్ల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూనిట్‌లో 3 పుంజులు, 8 పెట్టెలు (మొత్తం 11) ఉంటాయని, ధర ₹4,500 అని ఏపీఏం అప్పలనాయుడు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు.

March 4, 2026 / 05:14 PM IST

శ్రీకాకుళంలో ఆర్జేడీ ఆకస్మిక తనిఖీలు

SKLM: ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా పలు పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ శేఖర్ బాబు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రణస్థలం వెళ్లి పోలీస్ స్టేషన్లో ప్రశ్న పత్రాల పరిస్థితిని గమనించారు. అనంతరం శ్రీకాకుళం ఆర్ఐవో కార్యాలయాన్ని సందర్శించారు. ఆర్ఐవో సురేష్ కుమార్ డెక్ సభ్యులు శ్యామ సుందర్ ఆర్జేడీ శేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

March 4, 2026 / 05:12 PM IST

‘స్త్రీ శక్తి భవన నిర్మాణ పనులు తనిఖీ చేసిన కలెక్టర్’

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్నచిన్న పెండింగ్ పనులు పూర్తిచేసి మార్చి 31 నాటికి భవనాన్ని ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

March 4, 2026 / 05:12 PM IST

పర్యావరణ సమతుల్యత సాధ్యం

MNCL: అడవులు, వన్యప్రాణులతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని తాళ్లపేట FRO సుష్మారావు అన్నారు. బర్ద్ వాచ్ కార్యక్రమంలో భాగంగా జన్నారం మండలంలోని తపాలాపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం మండలంలోని గోండుగూడా గేటు ద్వారా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని, వాటిని కాపాడేందుకు కృషి చేయాలన్నారు.

March 4, 2026 / 05:09 PM IST

అక్షరాంధ్ర శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్

కర్నూలు జిల్లా వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షరాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరిలో అక్షరాభ్యాస శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇవాళ సందర్శించారు. శిబిరంలో అభ్యాసకుల హాజరు, పాఠ్య బోధన విధానం, నేర్చుకునే పురోగతిని పరిశీలించిన కలెక్టర్, వయోజనులకు అక్షరాస్యత పెంపొందించే దిశగా కార్యక్రమాన్ని సమర్థవంతగా అమలు చేయాలన్నారు.

March 4, 2026 / 05:08 PM IST

నదిలోకి వెళ్లకుండా నిఘా

MNCL:హోలీ పండుగ పురస్కరించుకొని కోటపల్లి మండలం వెంచపల్లి వద్ద ప్రాణహిత నదిలోకి ప్రజలు వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. నది లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని, ఎవరూ స్నానాలకు రావద్దని సూచించారు. CI కృష్ణ ఆదేశాల మేరకు సర్పంచ్ రవళి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ వర్కర్లను నది వద్ద కాపలా ఉంచారు. ప్రజలు సహకరించాలని కోరారు.

March 4, 2026 / 05:08 PM IST

‘ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’

MNCL: తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ కారులకు ప్రతి నెల రూ.50 వేల పెన్షన్ , 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డు ఇవ్వాలని కోరారు. ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

March 4, 2026 / 05:05 PM IST

దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే

MNCL: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని జన్నారం మండలంలోని కామన్పల్లి గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్ అన్నారు. బుధవారం తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ పనిచేస్తుందని చెప్పారు. గ్రామాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.

March 4, 2026 / 05:05 PM IST

టీచర్ల జీతాలకు కోత?.. ప్రభుత్వం క్లారిటీ

TG: ఉపాధ్యాయుల జీతాల అంశంపై ఇటీవల విద్యా కమిషన్‍ ఇచ్చిన నివేదికపై తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు విమర్శించారు. చాలా మందిని కన్సల్ట్ అయ్యాకే విద్యా కమిషన్ రిపోర్టు తయారు చేసిందని.. ఆ నివేదికను త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామన్నారు. కాగా, టీచర్లకు వేతనాలు అధికంగా ఉన్నాయని, వీటిని హేతుబద్ధీకరించాలని కమిషన్ అభిప్రాయపడింది.

March 4, 2026 / 05:05 PM IST