• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన బీటీ రోడ్డు ప్రారంభం

ASR: ముంచంగిపుట్టు మండలం కించయిపుట్టు పంచాయతీ పి.ఆర్ రోడ్డు నుంచి వరుకుగుమ్మి గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు మండల టీడీపీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్య ఇవాళ ప్రారంభించారు. దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా రహదారులు మంజూరు చేసి పనులు వేగవంతం చేస్తోందని నాయకులు తెలిపారు.

March 4, 2026 / 05:29 PM IST

రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన AHAలు

NDL: పశుసంవర్ధక సహాయకుల రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ బాబు బుధవారం అహోబిలేశున్ని దర్శించుకున్నారు. కోవెలకుంట్లకు విచ్చేసిన ఆయనకు AHAలు అన్వర్ బాషా, మహబూబ్ బేగ్, సుబ్రమణ్యం, సుస్మిత, నిహారిక మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రాజేశ్ మాట్లాడుతూ.. 2023 బ్యాచ్ AHAల ప్రొబేషన్ డిక్లరేషన్ అంశంపై ఇటీవలే మంత్రి అచ్చెనాయుడు, డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు.

March 4, 2026 / 05:29 PM IST

సుప్రియ విజయం.. గ్రామ యువతకు ఆదర్శం

JGL: కోరుట్ల మండలం వేంపేట గ్రామానికి చెందిన ఇప్ప జలంధర్ కుమార్తె సుప్రియ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీవోగా రెండు ఉద్యోగాలు సాధించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేంద్ర రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. సుప్రియ గ్రామ యువతకు ఆదర్శం, యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.

March 4, 2026 / 05:28 PM IST

‘శ్రామిక మహిళా దినోత్సవ సభజయప్రదం చేయండి’

MHBD: కేంద్ర ప్రభుత్వం మహిళా కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న మహబూబాబాద్‌లో నిర్వహించే శ్రామిక మహిళా దినోత్సవ సభను విజయవంతం చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణవేణి కోరారు. బుధవారం సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మహిళా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

March 4, 2026 / 05:28 PM IST

కార్మికులకు కరువు బత్యాన్ని అమలు చేయాలి: రాజన్న

NRML: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజన్న డిమాండ్ చేశారు. బుధవారం సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కరువుభత్యం రూ.5.50 పెరగడంతో ప్రతి 1000 బీడీలకు రూ.268.31 చెల్లించాలన్నారు.

March 4, 2026 / 05:28 PM IST

మహిళా భద్రతపై పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బుధవారం విద్యార్థినిలకు కరాటే, ఆత్మరక్షణ మీద శిక్షణ అందించారు. టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఐ షేక్ గఫూర్ మాట్లాడుతూ.. మహిళా భద్రతపై పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలని సూచించారు.

March 4, 2026 / 05:26 PM IST

రేపల్లెవాడలో మురుగు కాలువల ప్రక్షాళన

KMM: చింతకాని మండలం రేపల్లెవాడ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం డ్రైన్లలో పేరుకుపోయిన పూడిక (సిల్ట్) తొలగింపు కార్యక్రమాన్ని సర్పంచ్ మడిపల్లి అంబిక ప్రారంభించారు. వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండకుండా, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. గ్రామస్తులందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

March 4, 2026 / 05:25 PM IST

93వ రోజుకు చేరిన ఎర్రవల్లి దీక్షలు

NGKL: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రవల్లి తండాల గ్రామస్థులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు బుధవారానికి 93వ రోజుకు చేరుకున్నాయి. తమ గ్రామాలు రిజర్వాయర్ ముంపునకు గురికావద్దని కోరుతూ.. ఇరు గ్రామాల ప్రజలు పట్టువదలని పోరాటం చేస్తున్నారు.

March 4, 2026 / 05:25 PM IST

విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం

NLR: సంగం జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులకు బుధవారం ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాజేష్, హెడ్‌మాస్టర్ బుజ్జయ్య, పీడీ రమణయ్య పాల్గొన్నారు. ఆపద సమయంలో ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో విద్యార్థినులకు సూచనలు చేశారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 4, 2026 / 05:23 PM IST

గుట్ట పైకి రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎప్పుడో..?

JN: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధిలోని శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పైకి వెళ్ళే రోడ్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చి దాన్ని పూర్తి చేస్తాం అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదన్నరు.

March 4, 2026 / 05:23 PM IST

క్రీడా పాఠశాల ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

BHPL: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు అర్హులైన దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లా క్రీడాశాఖ అధికారి రఘు ఆధ్వర్యంలో ఈ ఎంపికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

March 4, 2026 / 05:22 PM IST

గట్టుప్పల్‌లో మూడేళ్లయినా తీరని వైద్య కష్టాలు

NLG: గట్టుప్పల్ మండల కేంద్రంగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక సబ్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హాస్పిటల్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు.

March 4, 2026 / 05:21 PM IST

జనగణన బాధ్యతగా నిర్వహించాలి: డీఆర్వో

అనంతపురం జేఎన్టీయూలో అధికారులకు, సిబ్బందికి జనగణనపై శిక్షణ తరగతులు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మలోలా మాట్లాడుతూ.. దశాబ్దం తర్వాత చేపడుతున్న ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో, మొబైల్ యాప్ ద్వారా జరుగుతుందని వివరించారు.

March 4, 2026 / 05:20 PM IST

గ్రామపంచాయతీకి మైకు సెట్ బహుకరణ

BHNG: భువనగిరి మండలం తుక్కాపురం గ్రామపంచాయతీకి చేనిగాచర్ల గ్రామానికి చెందిన బింగి నరేష్ యాదవ్ స్వంత డబ్బులతో వాళ్ళ అమ్మ నాన్న కీ.శే. బింగి శాంతమ్మ,పెంటయ్య జ్ఞాపకర్థంగా రూ.60 వేలు పెట్టి మైక్ సెట్‌ను బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ పాండు నరేష్‌ను సన్మానించారు.

March 4, 2026 / 05:20 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక పరిశీలన

GDWL: మానవపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సరిగా తనిఖీ చేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి గర్భిణీకి సురక్షితమైన సాధారణ ప్రసవాలు జరగాలని అధికారులు జాగ్రత్తగా చూడాలని ఆమె సిబ్బందికి ఆదేశించారు.

March 4, 2026 / 05:20 PM IST