CTR: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పశువైద్య కేంద్రంలో పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలను 50% సబ్సిడీపై పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు హాజరై యంత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రూ.40,500ల విలువ గల యంత్రాన్ని రూ.20,250కే అందిస్తున్నట్లు తెలిపారు.
RR: ప్రపంచ శాంతి కోసం కర్ణాటక నుంచి బౌద్ధ బైక్షువులు చేపట్టిన 450 కిలోమీటర్ల పాదయాత్ర ఎల్బీనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు శంకర్ వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడి శాంతి మార్గంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని తెలిపారు.
GNTR: తెనాలికి చెందిన టీడీపీ నాయకురాలు జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకర, అసత్య ప్రచారాలు చేసినందుకు బాపట్లకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్‌ను తెనాలి రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. టీటీడీ ఛైర్మన్ వ్యవహారంలో ఆమెను ఉద్దేశించి సయ్యద్ దుష్ప్రచారం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని సీఐ తెలిపారు.
కృష్ణా: గుడివాడ చాపల మార్కెట్ వినాయకుడి గుడి సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు, పోలీస్ సిబ్బందితో కలిసి వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ పేకాట శిబిరంపై బుధవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 11మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, రూ. 13,670ల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మార్కాపురం మార్కెట్ యార్డ్‌ను జేసీ పి. శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కందులు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, సేకరణ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తూకంలో తేడాలు రాకుండా చూసి రైతులకు తగిన న్యాయం చేయాలని, ధరల విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.
SDPT: కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్ల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
MDK: రామాయంపేట పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా బీ.శ్రావణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన ఆయనకు మున్సిపల్ కమిషనర్‌గా ఇది మొదటి పోస్టింగ్ కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పురపాలక సంఘం ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో అందజేస్తాన్నన్నారు
KRNL: వీఆర్ఏలకు పే స్కేల్ వేతనాలను అమలు చేయాలని బుధవారం పెద్దకడబూరులోని తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి వీఆర్ఏలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు నరసింహులు, నాగరాజు, భీమన్న, ఉసేని మాట్లాడుతూ.. వీఆర్ఏలు ఏళ్ల తరబడి చాలీ చాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు.
VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు వెల్ఫేర్ ఆంగ్ల పాఠశాల విద్యార్థినులకు స్వీయ రక్షణ మెళుకువలు బుధవారం నేర్పించారు. ఈ కార్యక్రమానికి ASP సౌమ్య లత హాజరై మాట్లాడారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో స్వశక్తితోనే తమను తాము రక్షించుకోవాలని సూచించారు. ఈవ్ టీజింగ్, వేధింపులను ఎదుర్కొనే విధానాలు వివరించారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ కేవలం పాటలకే పరిమితం కానుండగా, BGM తమన్ అందించబోతున్నాడు. ఈ మేరకు మేకర్స్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు ఒకే సినిమా కోసం పనిచేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.
WGL: నెక్కొండ పట్టణ ప్రజల సౌకర్యార్థం ఇందిరాగాంధీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘చేయూత’ పెన్షన్ పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచనల మేరకు గత సర్పంచ్ ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. సర్పంచ్ హరిప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
TPT: శ్రీసిటీలో 55వ జాతీయ భద్రతా వారోత్సవాల ముగింపు వేడుకలు బుధవారం నిర్వహించారు. పరిశ్రమల సిబ్బంది, ఉద్యోగులు, సమీప పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ సతీష్ కామత్ భద్రతా జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి భద్రతా ప్రమాణాల పాటింపు అత్యవసరమని పేర్కొన్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
ASR: హుకుంపేట మండలం బోడిగట్టులో బుధవారం రైతు సాధికార సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు పర్యటించారు. అక్కడ నిర్వహిస్తున్న అటవీ చైతన్య ద్రావణం ప్రయోగ క్షేత్రం పరిశీలించారు. ఈ ద్రావణం వినియోగంతో పంటల పెరుగుదల, నేల సారవంతం, పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని తెలిపారు. సహజ వ్యవసాయ పద్ధతుల్లో అటవీ ఆధారిత ద్రావణాల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.
AP: గత ప్రభుత్వంలో ఒక్క DSC నిర్వహించలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్. 175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రీయల్ పార్క్‌లు ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటివరకు 6,28,327 మందికి ఉద్యోగాలిచ్చాం’ అని ఆయన పేర్కొన్నారు.
KMM: చింతకాని మండలం నాగులవంచ సమీపంలో మార్చి 1న జరిగిన రెండు ట్రాక్టర్ల ప్రమాదంలో ఓ యువ డ్రైవర్ దుర్మరణం చెందారు. మృతుడి వయస్సు ఆధార్ ప్రకారం 19 ఏళ్లని తల్లి పేర్కొన్నప్పటికీ, SSC మెమో ఆధారంగా అతను 16 ఏళ్ల మైనర్ అని పోలీసుల విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా మైనర్‌కు వాహనాన్ని అప్పగించినందుకు గానూ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.