HYD: తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు ఘనంగా జరుగుతుంది. వివాహం విందుకు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. నగరం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు కూడా హాజరయ్యారు.
MHBD: సీరోలు మండలం అందనాలపాడులో విషాదం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త మృతిచెందిన ఘటన జరిగింది. సురేష్ కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న సాయితో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై పలుమార్లు పెద్దమనుషులతో పంచాయతీ కూడా చేశారు.భార్య ప్రవర్తన మారకపోవడంతో సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీను ఆరోపించారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరళ్ శ్రీవాస్తవ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ELR: నూజివీడు పట్టణంలోని కళాశాల విద్యార్థినులతో ‘ఆత్మ సంరక్షణ’ అనే అంశంపై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపద సమయాల్లో మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలో CI సత్య శ్రీనివాసరావు, ఎస్సై నాగేశ్వరరావు వివరించారు. కళాశాల పరిసరాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా వేధింపులకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించ కుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ADB: సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని బోథ్ CI గురుస్వామి బుధవారం తెలియజేశారు. పెద్దమ్మతల్లి విగ్రహ ధ్వంసంపై గొడవలకు దారి తీసేలా ప్రవర్తించిన నిందితుడు జాదవ్ వినోద్ చర్యలు తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను ప్రజలు నమ్మవద్దని CI సూచించారు.
T20 WCలో ఆల్ రౌండర్ శివమ్ దూబె బౌలర్‌గా పెద్ద ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో దూబేకు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. దీనిపై తాజాగా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ.. దూబెపై నమ్మకం ఉందని, అతడిని ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసన్నాడు. సెమీస్‌లో దుబే బౌలింగ్ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపాడు.
VSP: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన నిమ్మకాయల ఈశ్వరమ్మను మహారాణిపేట పోలీసులు 24 గంటల్లోనే ఆచూకీ కనిపెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆమె ఆచూకీ గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో వేగంగా స్పందించిన సీఐ దివాకర్ యాదవ్, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, డీసీపీ విజయ్ మణికంఠ అభినందించారు.
GNTR:అసెంబ్లీలో బుధవారం సీఎం చంద్రబాబును ప్రత్తిపాడు తెలుగు మహిళా అధ్యక్షురాలు యడ్లపల్లి వాణి మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ విద్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, కుట్టు మిషన్లు, ఉచిత స్మార్ట్ ఫోన్ల వంటి సంక్షేమ పథకాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతో దోహదపడతాయని ఆమె కొనియాడారు.
KRNL: నగరపాలక పరిధిలోని పలు వార్డు సచివాలయాలను కమిషనర్ పీ.విశ్వనాథ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరవేసేలా ఉద్యోగులు అంకితభావంతో కృషి చేయాలని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించాలని ఆయన సూచించారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను(33) మృతి చెందాడు. ఇవాళ ఒక్కరోజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్‌లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
VZM: మహిళ సాధికారిత వారోత్సవాలలో బాగంగా ఎస్పీ ఆదేశాలతో కొత్తవలస పరిధిలోని పలు కళాశాలలో సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో మహిళ పోలీసులు స్వీయ రక్షణపై విద్యార్థులకు మెళుకువలు నేర్పించారు. ప్రతి విద్యార్థి ఇతరులపై ఆధారపడకుండా తమను తాము స్వశక్తితో రక్షించుకునేందుకు ఆత్మరక్షణ విద్యార్థుల దశ నుండే నేర్చుకోవాలన్నారు. అలా నెరుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం వావిలాల శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు గొల్లపూడి గ్రామానికి, మరొకరు అడసర్లపాడు గ్రామానికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLR: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ సమాజాభివృద్ధిలో మీడియా కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో మీడియా ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన మీడియా అక్రిడేషన్ కార్డులను కలెక్టర్ అందజేశారు. సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు.
PLD: గత ప్రభుత్వంలోని వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వల్ల సర్పంచ్‌లు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ విమర్శించారు. బుధవారం శాసనమండలిలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌ల అధికారాలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు.
GDWL: సైబర్ జాగ్రుకత దివాస్, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గద్వాల జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఓ అవగాహన సదస్సులు నిర్వహించారు. డిజిటల్ అరెస్ట్ వంటివి వాస్తవం కాదని, అపరిచిత లింక్స్‌ను క్లిక్ చేయవద్దని ఆయన సూచించారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.