• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

VZM: మహిళలకు ‘నానీ కేర్ సర్వీసెస్’ సర్టిఫికేట్ కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ బి. రెబెక్కా శామ్యూల్ తెలిపారు. శిక్షణ కోర్సు కాల పరిమితి 6 నెలలు, కోర్సు పూర్తి చేసిన వారికి విదేశాలలో ఉద్యోగవకాశాలు ఉంటాయాన్నారు. 10 పాసై, 25 నుండి 50 వయసు ఉన్న మహిళలు అర్హులన్నారు. వివరాలకు 8333921338 సంప్రదించాలన్నారు.

March 4, 2026 / 08:14 PM IST

మదనపల్లెలో జనసేన నేత మహేష్‌పై అద్దె వివాదం

అన్నమయ్య: మదనపల్లెలో జనసేన నేత మహేష్‌పై అద్దె బకాయిల వివాదం వెలుగుచూసింది. హోటల్, ఇంటి అద్దెలను లక్షల్లో చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచారని బాధితులు సుధాకరరెడ్డి, మునిరత్నం ఆరోపించారు. అద్దె గురించి అడిగితే గొడవపడుతున్నారని పేర్కొంటూ అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి ఫిర్యాదు చేశారు. లాడ్జిలో హోటల్‌కు, అలాగే నీరుగట్టుపల్లిలోని ఇంటికి అద్దె బకాయిలు ఉన్నట్లు తెలిపారు.

March 4, 2026 / 08:14 PM IST

అమిత్ షాతో రేవంత్ రెడ్డి భేటీ

TG: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ వెంట డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి ఉన్నారు. మార్చి 31 వరకు మావోయిస్టు రహిత దేశంగా మార్చడంపై చర్చిస్తున్నారు. మావోయిస్టు కీలక నేత దేవ్ జీ సహా పలువురు నేతల లొంగుబాటుపై చర్చిస్తున్నట్లు సమాచారం.

March 4, 2026 / 08:14 PM IST

అధికారులతో మంత్రి సమీక్ష

HYD: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలిదశలో మార్చి 6 నుంచి 31 వరకు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.

March 4, 2026 / 08:13 PM IST

కేజీహెచ్‌లో వైద్య పరికరాలుఅందజేత

VSP: కేజీహెచ్ ఆసుపత్రి పిల్లల విభాగానికి అవసరమైన పరికరాలను ఎగస్ట్రా మైల్ ఫౌండేషన్ డాక్టర్ నీతాష రూ.2 లక్షల విలువైన సామగ్రిని సూపరింటెండెంట్ వాణీకి అందజేశారు. ఈ పరికరాలు నవజాత శిశువులకు మెరుగైన శ్వాస సహాయక చికిత్స అందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. దాతల సహకారంతో కేజీహెచ్‌ను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.

March 4, 2026 / 08:13 PM IST

విద్యుత్ మోటర్ వైర్ల దొంగల ముఠా అరెస్ట్

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, ఆళ్లగడ్డ ఎస్డీపీవో ఆదేశాల మేరకు రుద్రవరం పోలీసులు దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వివిధ మండలాల్లో రైతుల బోర్ల వద్ద విద్యుత్ వైర్లను కట్ చేసి దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ డీ. రాము వెల్లడించారు.

March 4, 2026 / 08:12 PM IST

దుబాయ్‌లో చిక్కుకున్న ఎల్కతుర్తి వాసి యాదగిరి

HNK: ఎల్కతుర్తి మండల కకేంద్రానికి చెందిన బొంకురి యాదగిరి దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు. ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో, స్వదేశానికి రావాల్సిన యాదగిరి అక్కడే ఉండిపోయినట్లు బుధవారం కుటుంబీకులు తెలిపారు.కొన్నేళ్లుగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆయన, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

March 4, 2026 / 08:12 PM IST

నవల్గలో మిన్నంటిన హోలీ సంబరాలు!

VKB: బషీరాబాద్ మం. నవల్గలో హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. బుధవారం ఉదయం నుంచే గ్రామ యువకులు, చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. నిన్న చంద్రగ్రహణం ఉండటంతో శాస్త్రోక్తంగా వేడుకలను వాయిదా వేసుకున్నట్లు గ్రామ యువకులు తెలిపారు. గ్రహణం వీడిన తర్వాత ఈరోజు ఉదయం హోలీ జరుపుకోవడం శుభపరిణామమని వారు పేర్కొన్నారు.

March 4, 2026 / 08:12 PM IST

కొత్తబస్తీలో మురుగు సమస్యల పరిష్కారానికి చర్యలు

MDCL: అల్వాల్ సర్కిల్‌లోని కొత్తబస్తీలో మురుగు కాలువలు తరచుగా బ్లాక్ అవుతూ, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్యలపై బుధవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగు లైన్ తరచుగా మూసుకుపోతున్నందున కొత్త లైన్ వేయడానికి అంచనా (ఎస్టిమేట్) సిద్ధం చేసి ప్రాధాన్యతతో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 4, 2026 / 08:10 PM IST

లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేత?

TG: తెలంగాణ పోలీసులకు మావోయిస్టు అగ్రనేత టచ్‌లోకి వచ్చారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవ్ జీ లొంగిపోయిన సమయంలో గణపతి ఆచూకీ పోలీసులు కనిపెట్టిన విషయం తెలిసిందే.

March 4, 2026 / 08:10 PM IST

T20 WC: పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా

సౌతాఫ్రికాతో సెమీస్‌లో న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరి ధాటికి సఫారీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 10.2 ఓవర్లలోనే 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. మార్‌క్రమ్(18), మిల్లర్ (6)లను రవీంద్ర పెవిలియన్ చేర్చగా.. దూకుడుగా ఆడుతున్న బ్రెవిస్(34)ను నీషమ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్, యాన్సన్ ఉన్నారు.

March 4, 2026 / 08:07 PM IST

‘రంజాన్ మాసం సేవా భావాలకు ప్రతీకగా నిలుస్తుంది’

JGL: రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావాలకు ప్రతీకగా నిలుస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని 31వ వార్డులో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజంలో సౌభ్రాతృత్వం, సామరస్యం పెపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. తాము లౌకికవాదం, సామాజిక న్యాయంకు కట్టుబడి ఉంటామన్నారు.

March 4, 2026 / 08:05 PM IST

బీహార్ బాలవికాస్ బాలికల నాటక ప్రదర్శన

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో బుధవారం హోలీ పండుగ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరిగాయి. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రానికి చెందిన సత్యసాయి బాలవికాస్ బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక నాటకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధనలు, భక్తి తత్వాన్ని చాటిచెప్పేలా సాగిన ఈ ప్రదర్శనలో బాలికలు తమ అభినయంతో మెప్పించారు.

March 4, 2026 / 08:04 PM IST

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ABVP నిరసన

NZB: ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిన్న చనిపోయిన రాంచరణ్కు న్యాయం జరగాలని ABVP ఆధ్వర్యంలో GGH ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి మాట్లాడుతూ.. వార్డెన్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.

March 4, 2026 / 08:04 PM IST

‘అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలి’

SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పంచాయితీ సీతంపేటలో గ్రామీణ రోజ్ గార్ యోజన పనులను రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు.

March 4, 2026 / 08:02 PM IST