• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే

BDK: భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. బుధవారం పంచాయతీ పరిధిలోని 4, 6, 11వ వార్డుల్లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

March 4, 2026 / 06:35 PM IST

జగన్‌కు అచ్చెన్న క్షమాపణలు చెప్పాలి: MLC

AP: జగన్ రాష్ట్రంలో అనేక దేవాలయాలను దర్శించారని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ‘సభలో లేని జగన్ గురించి మాట్లాడారు. తిరుమలకు ఏడుకొండలు ఉండాలని YSR జీవో ఇస్తే చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు ఒక్కసారైన తిరుపతిలో తలనీలాలు ఇచ్చారా? లడ్డూపై నిందలు వేసి చర్చకు తెచ్చింది ఎవరు? జగన్‌కు అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు.

March 4, 2026 / 06:33 PM IST

విద్యార్థులకు ‘PMEGP’పై అవగాహన కార్యక్రమం

NLG: ఎంజీయూ (MGU) కామర్స్ విద్యార్థులకు ‘ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం’ (PMEGP)పై అవగాహన కల్పించారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పథక ఉద్దేశాలు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, దరఖాస్తు ప్రక్రియపై నిపుణులు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆచార్య శ్రీదేవి, డైరెక్టర్ డా. సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 06:33 PM IST

అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ నిఘా

సత్యసాయి: ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యం సేవించడంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం పుట్టపర్తి రూరల్ పరిధిలోని బుగ్గపల్లి అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహించారు. ఆధునిక సాంకేతికతను వాడుతూ అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అక్రమ కార్యకలాపాలను రికార్డు చేశారు.

March 4, 2026 / 06:30 PM IST

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

NDL: సంజామల మండల పరిధిలోని ముదిగేడులో రూ.20 లక్షల నిధులతో బుధవారం నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సహకారంతో టీడీపీ నేత రాజగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఎస్సీ కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూతన రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు.

March 4, 2026 / 06:30 PM IST

ప్రధాన రహదారికి మరమ్మతులు

SRD: జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని కొడకంచి గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను అధికారులు పూడ్చారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారి వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా స్థానికుల విజ్ఞప్తితో మరమ్మతులు బుధవారం చేపట్టారు. గుంతలు పూడ్చడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

March 4, 2026 / 06:30 PM IST

రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి పేరు..?

TG: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై PCC అధ్యక్షుడితో AICC ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య పేర్లను అధిష్టానం ప్రస్తావించింది. ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలని నేతల అభిప్రాయం కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి ఎవరు పనిచేశారో వాళ్లనే ఎంపిక చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి, రాహుల్, ఖర్గేతో మాట్లాడి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

March 4, 2026 / 06:29 PM IST

మద్యం బార్లకు లాటరీ

W.G: భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం రెండు మద్యం బార్లను జనరల్ కేటగిరీలో లాటరీ పద్ధతి జేసీ రాహుల్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఒక మద్యం బార్‌కు ఎం.దానారావు ఒక్కొరే నాలుగు దరఖాస్తులు వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 4, 2026 / 06:27 PM IST

కోటగుళ్లు గణపేశ్వరునికి మోదుగు పూలతో అలంకరణ

BHPL: గణపురం కోటగుళ్లలో హోలీ పండుగ సందర్భంగా బుధవారం మోదుగు పూలతో స్వామివారిని ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరణ కార్యక్రమానికి ముందు మంగళవారం చంద్రగ్రహణం అనంతరం ఆలయ ప్రాంగణంలోని గణపతి, నందీశ్వరుడు నాగదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నాగరాజు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

March 4, 2026 / 06:27 PM IST

ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు: ఎస్సై

KMM: చింతకాని మండలంలో జరిగిన ఇసుక ట్రాక్టర్ ప్రమాద ఘటనలో యజమానిపై కేసు నమోదైంది. ఈ ప్రమాదంలో బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన నాగయ్య మృతి చెందారు.మృతుడు తొలుత 19 ఏళ్ల యువకుడిగా భావించినా పదో తరగతి సర్టిఫికెట్స్ ఆధారంగా 16 ఏళ్ల మైనర్ అని తేలింది.నిబంధనలకు విరుద్ధంగా మైనర్‌కు వాహనం ఇచ్చినందుకు యజమానిపై చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వీరేందర్ బుధవారం తెలిపారు.

March 4, 2026 / 06:27 PM IST

ఆలయ అభివృద్ధికి చర్యలు: MLA నాగరాజు

HNK: ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నేడు ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, దేవాలయాల అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే అన్నారు.

March 4, 2026 / 06:26 PM IST

UPDATE: యువకుడు దారుణ హత్య..!

CTR: తుమ్మిందపాళ్యంలో ఇవాళ ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను పోలీసుల వెల్లడించారు. ఢిల్లీ బాబు వద్ద సాయికుమార్ రూ. 2 లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. అప్పు ఇవ్వలేదని అడిగే క్రమంలో ఏర్పడిన గొడవలో ఢిల్లీ బాబు సాయికుమార్‌ను నాటు తుపాకితో కాల్చాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 4, 2026 / 06:25 PM IST

‘అధిక దిగుబడులకు సస్యరక్షణ పాటించాలి’

రైతులు సాగుచేస్తున్న వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు రావాలంటే సస్యరక్షణ, ఎరువుల యాజమాన్య పద్దతులు పాటించాలని రాగోల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ్‌బాబు అన్నారు. కోటబొమ్మాలి మండలం చిట్టేవలస, తిలారు గ్రామాల్లోని రైతులకు వేరుశెనగ పంటపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఏడీఏ కె. జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.

March 4, 2026 / 06:25 PM IST

విశాఖకు ఐటీ వెల్లువ

VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉపాధి కోసం యువత బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి మారుతోందని ఆయన పేర్కొన్నారు.

March 4, 2026 / 06:25 PM IST

రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కాలనీ ప్రారంభం

NLR: రామాయపట్నం పోర్టు నిర్వాసితుల కోసం గుడ్లూరు మండలం కర్లపాలెంలో R&R కాలనీ నిర్మించారు. దీనిని మంత్రి BC జనార్ధన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. రూ.40 కోట్లతో ఈ కాలనీ నిర్మాణం జరిగింది. పోర్టు నిర్వాసితులకు ఈ కాలనీలో పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, MLA ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 06:24 PM IST