న్యూజిలాండ్‌తో జరుగుతున్న T20 WC సెమీస్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ జట్టు 20 ఓవర్లలో 169/8 పరుగులు చేసింది. ఒక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టబ్స్ (29), యాన్‌సన్(55) ఆదుకున్నారు. బ్రెవిస్ 34 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో మెక్‌కాంచీ, రవీంద్ర, హెన్రీ తలో 2 వికెట్లు తీశారు.
W.G: కాళ్ల శివాలయం వీధిలో బుధవారం గ్యాస్ లీకై ఒక తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న ఆకివీడు ఫైర్ ఆఫీసర్ జీ. వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇల్లు కోల్పోయిన బాధితులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియా ఇందారం ఉపరితల గనిలో ఓబీ వెలికి తీసే పనులు కార్మికులతో చేపించాలని యాజమాన్యం నిర్ణయించినందున దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని గుర్తింపు AITUC నాయకులు డిమాండ్ చేశారు. నాయకులు వీరభద్రయ్య, బాజీ సైదా బుధవారం గనిని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేటర్ల, ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్ల కొరత ఉందన్నారు.
AP: దేవుడిపై తమకు అపారమైన నమ్మకం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. ‘లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. కల్తీ జరిగిందని స్పష్టంగా సీబీఐ నివేదికలో ఉంది. వైవీ సుబ్బారెడ్డి కూడా దీనిని ఒప్పుకున్నారు. లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడు’ అని హెచ్చరించారు
భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గడువు ముగిసిన మందులపై నిఘా ఉంచాలని, గర్భిణీలకు అన్ని పరీక్షలు ఆసుపత్రిలోనే చేయాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
SRCL: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు చేపట్టనున్న “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” పై జిల్లాలో నిర్వహించాల్సిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం అధికారులతో నిర్వహించారు.
SRCL: కాలువ పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఇల్లందకుంట మండలం పెద్దలింగాపూర్‌లో అసంపూర్తిగా ఉన్న 11/6 కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ, రైతులు చేపట్టిన దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
MBNR: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి పేర్కొన్నారు, తమ ప్రభుత్వమే పేదల సొంతింటి కలను సాకారం చేస్తుందన్నారు. బుధవారం గండీడ్ మండలం పగిడ్యాల్లో లబ్ధిదారులందరి ఇల్లు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గరిష్ఠ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. వాస్తవంలోనే ప్రభుత్వం ప్రజాభివృద్ధిపై దృష్టి పెట్టిందని అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల విద్యుత్ కార్యాలయంలో లైన్మెన్ దివాస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. డీఈ రంగస్వామి, ఏడీఈ రఘురామయ్య ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బందిని సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులు సూచించారు.
CTR: పాలసముద్రం మండలం ఆముదాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రిని తాళ్లూరి శివ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “క్రమశిక్షణతో చదువుకుంటే జీవితం బంగారు లోకంలా మారుతుంది. విద్యార్థులు మంచి చదువుతో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మార్కెటింగ్ కమిటీ వైస్ ఛైర్మన్ అరుల్ నాదన్ పాల్గొన్నారు.
HYD: తాజ్ కృష్ణలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహావిందు ఘనంగా జరుగుతుంది. వివాహం విందుకు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. నగరం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు కూడా హాజరయ్యారు.
MHBD: సీరోలు మండలం అందనాలపాడులో విషాదం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో భర్త మృతిచెందిన ఘటన జరిగింది. సురేష్ కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న సాయితో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై పలుమార్లు పెద్దమనుషులతో పంచాయతీ కూడా చేశారు.భార్య ప్రవర్తన మారకపోవడంతో సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీను ఆరోపించారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరళ్ శ్రీవాస్తవ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ELR: నూజివీడు పట్టణంలోని కళాశాల విద్యార్థినులతో ‘ఆత్మ సంరక్షణ’ అనే అంశంపై బుధవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపద సమయాల్లో మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలో CI సత్య శ్రీనివాసరావు, ఎస్సై నాగేశ్వరరావు వివరించారు. కళాశాల పరిసరాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా వేధింపులకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించ కుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.