AP: YCPలో పదవుల భర్తీలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పలు నియామకాలను చేపట్టారు. ఈ మేరకు YCP కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ CEC సభ్యునిగా పెద్ద నాగిరెడ్డి(నంద్యాల), SEC సభ్యుడిగా వైసీ గోవర్ధనరెడ్డి(మడకశిర), పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కంగాటి ప్రదీప్ రెడ్డి(పత్తికొండ), పార్టీ రాష్ట్ర సెక్రటరీ(పార్లమెంటు), పోరెడ్డి నరసింహారెడ్డి(ప్రొద్దుటూరు) నియమితులయ్యారు.
దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సివిల్ సర్వీసెస్ ఆశావహులకు కీలక సమయం ఆసన్నమైంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2025 తుది ఫలితాలు రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 27వ తేదీతో ఇంటర్వ్యూలు ప్రక్రియ పూర్తి కావడంతో, కమిషన్ ఫలితాలను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
అన్నమయ్య: వైసీపీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాసనమండలి ఛైర్మన్‌పై కులమతాల వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. హెరిటేజ్ అంశంపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం సభను పక్కదారి పట్టిస్తోందని అన్నారు. అచ్చెన్నాయుడిని సభ నుంచి సస్పెండ్ చేసి టీడీపీ నుంచి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
TG: కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. సుమారు గంట పాటు వీరి భేటీ జరిగింది. రాష్ట్ర పరిస్థితులు, మావోయిస్టు నేతల లొంగుబాటుపై వివరించారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కాగా, కేంద్రం తీసుకువచ్చిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయిన విషయం తెలిసిందే.
రేపు భారత్‌తో జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్పిన్నర్ల నుంచి తమ జట్టుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. నెంబర్ వన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడం తమ బ్యాటర్లకు సవాలేనని, అతని బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం కష్టమని చెప్పాడు. స్పిన్నర్లను ఆడటంలో తమకు మంచి రికార్డు లేదని గుర్తు చేశాడు.
W.G: ఆచంట సబ్ రిజిస్ట్రార్‌గా బీ. జగన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత 6 నెలల నుంచి ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కార్యాలయం నడుస్తోంది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌కు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఎవరికి ఎటువంటి మామూళ్లు ఇవ్వనవసరం లేదన్నారు.
గుంటుపల్లి గవర్నమెంట్ హైస్కూల్‌లో ఎన్టీఆర్ వికాస్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు ఈ జాబ్ మేళాకు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,500 నుంచి రూ.35,000 వరకు జీతం ఉంటుందని చెప్పారు.
HNK: రాజ్యసభ సీటు మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించాలని కోరారు.
భారతీయ విద్యార్థులకు కెనడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్-కెనడా మధ్య విద్యా సంబంధాలను పునరుద్ధరించే దిశగా కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఏకంగా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 921 కోట్లు) భారీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కార్యాలయం ఈ నెల 2న అధికారిక ప్రకటన విడుదల చేసింది.
MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, IAS జిల్లా కేంద్రంలోని బీ.సీ. బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న భోజన నాణ్యత, వసతులను స్వయంగా పరిశీలించి, వారికి పౌష్టికాహారం అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబినేషన్‌లో ‘వృషకర్మ’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. రేపు మధ్యాహ్నం 12:12 గంటలకు గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఇందులో నాగచైతన్య నిధి అన్వేషకుడిగా నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
NZB: వర్ని మండలం కూనిపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మేకల మందపై చిరుత దాడి చేసింది. కునిపూర్ గ్రామానికి చెందిన కుక్కలి సాయిలు మేకల మందను అటవీ ప్రాంతంలోకి మేతకు తీసుకువెళ్లగా అకస్మాత్తుగా చిరుత దాడి చేసి ఒక మేకను చంపేసిందని చెప్పారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు.
E.G: నల్లజర్ల మండలం పోలవరం కుడి కాలువ గట్ల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కృష్ణారావు హెచ్చరించారు. ఎమ్మెల్యే మద్దిపాటి ఆదేశాల మేరకు ప్రకాశరావుపాలెం, ఆవపాడు, మారెళ్లముడి, సింగరాజుపాలెం గ్రామాల్లో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
NRPT: గ్రామాల్లో శాంతిభద్రత పరిరక్షణలో సర్పంచుల పాత్ర కీలకమని మరికల్ సీఐ భగవంతు రెడ్డి అన్నారు. బుధవారం సీఐ కార్యాలయంలో మరికల్ మండల పరిధిలోని సర్పంచులకు అవగాహన సదస్సును నిర్వహించారు. సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన, సీసీ కెమెరాలు ఏర్పాట్లపై సర్పంచులకు సూచనలు చేశారు.
సత్యసాయి: వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. తాగునీటి ఎద్దడి, సరఫరా అంతరాయం, పైప్‌లైన్ లీకేజీల వంటి సమస్యలను మడకశిర 9550306100, హిందూపురం 8247625245, పెనుకొండ 9885447204, పుట్టపర్తి 9490517016, కదిరి 6281434418 నంబర్లకు తెలపాలన్నారు.