• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్తు..!

WGL: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ వరప్రదాయినిగా మారింది. పదో తరగతి తర్వాత తక్కువ సమయంలోనే ఇంజినీరింగ్ మెలకువలు నేర్చుకునేందుకు ఈ కోర్సులు దోహదపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు స్వయం ఉపాధితో పాటు, పారిశ్రామిక రంగంలో తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం డిప్లొమా వైపు మొగ్గు చూపుతున్నారు.

March 5, 2026 / 05:31 AM IST

పిఠాపురంలో ‘స్కిల్ పార్కు’ ఏర్పాటు చేయాలని వినతి

KKD: పిఠాపురం నియోజకవర్గంలో చేనేత సొసైటీలకు చెందిన స్థలాల్లోనే స్కిల్ డెవలప్మెంట్ పార్కును ఏర్పాటు చేయాలని ఏపీ పద్మశాలి వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ జయకృష్ణ బుధవారం కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చొరవతో రూ.15 కోట్లతో మెగా షోరూమ్స్, డిజైనింగ్, డయింగ్ యూనిట్లు రానున్నాయి.

March 5, 2026 / 05:30 AM IST

ఈ నెల 7న గొల్లవిల్లిలో విద్యుత్ సమస్యలపై సీజీఆర్ఎస్

కోనసీమ: ఈ నెల 7వ తేదీన ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికై సీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అమలాపురం ఈఈ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సదస్సు జరుగుతుందన్నారు. విద్యుత్ సమస్యలు, ఫిర్యాదులు, బిల్లులు, కరెంట్ సరఫరా సమస్యలపై అభ్యంతరాలు తెలపవచ్చన్నారు.

March 5, 2026 / 05:30 AM IST

దంచికొడుతున్న ఎండలు

KRNL: రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. ప్రజలు ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీరు, శీతల పానీయాలు, ఫ్రూట్, పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

March 5, 2026 / 05:28 AM IST

మద్దిలేటి స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

NDL: బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన లెక్కింపులో 78 రోజులకు రూ.52,19,831 నగదు వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకల్లో 7.210 మిల్లీ గ్రాముల బంగారం, 621.320 గ్రాముల వెండి ఉన్నాయని ఆయన వివరించారు.

March 5, 2026 / 05:23 AM IST

‘మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి’

KRNL: మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆలూరు YCP ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తీవ్రంగా ఖండించారు. శాసన మండలి ఛైర్మన్‌ను కులం పేరుతో దూషించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. లడ్డూ కల్తీ అంశం నుంచి చర్చను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి వెంటనే తన మాటలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలన్నారు.

March 5, 2026 / 05:14 AM IST

ANUలో నేటి నుంచి ‘విద్య-పరిశ్రమల సమ్మేళనం-2026’

GNTR: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఏఎన్‌యూలో నేటి నుంచి ఈనెల 7 వరకు ‘విద్య-పరిశ్రమల సమ్మేళనం-2026’ నిర్వహిస్తున్నట్లు రెక్టార్ శివరాంప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగా మొత్తం 50 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

March 5, 2026 / 05:11 AM IST

‘లైన్ మోసాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి’

PLD: ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకు అధికారులను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆదేశించారు. బుధవారం నరసరావుపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన నమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల బ్యాంకు అకౌంట్లకు డబ్బులు చెల్లించి మరీ మోసాలకు వాడుతున్న విధానాన్ని నిరోధించేందుకు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

March 5, 2026 / 05:09 AM IST

కోమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకుఅంతరాయం

ప్రకాశం: కొమరోలు మండలంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం కారణంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మండలంలోని ఓబులాపురం, మల్లిపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

March 5, 2026 / 05:05 AM IST

మీ ఇంటికే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు

WNP: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. కేవలం రూ.151 చెల్లించి టీజీఎస్ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ ద్వారా ఆర్డర్ చేయవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు వివరాల కోసం 7382829379 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

March 5, 2026 / 04:52 AM IST

నేటి నుంచి పర్చూరులో టోల్ ప్లాజా ప్రారంభం

BPT: పిడుగురాళ్ల–వాడరేవు 167A జాతీయ రహదారిపై పర్చూరు మండలం ఉప్పుటూరు వద్ద నిర్మించిన టోల్ ప్లాజా గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. గత రెండు రోజులుగా సాంకేతిక పరీక్షలు నిర్వహించిన అధికారులు, వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

March 5, 2026 / 04:45 AM IST

సగం రోడ్డు.. వాహనదారుల అవస్థలు

ఖమ్మం నగరంలోని మమత రోడ్డుకు వెళ్లే దారిలో, అబ్దుల్ కలాం రోడ్డు నంబర్ 1 వద్ద రోడ్డు నిర్మాణం సగానికే నిలిచిపోయింది. రోడ్డు చివర భాగం దిగువగా ఉండటంతో వాహనాలు ఎక్కే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు. కార్లు వెళ్లడం కూడా కష్టతరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 04:44 AM IST

వైవీయూ డిగ్రీ 3, 4, 5 సెమిస్టర్ల ఫలితాలు విడుదల

KDP: వైవీయూ డిగ్రీ 3, 4, 5వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ బుధవారం విడుదల చేశారు. నవంబర్ 2025లో జరిగిన ఈ పరీక్షల్లో 3వ సెమిస్టర్‌లో 62.39%, 4వ సెమిస్టర్‌లో 81.58%, 5వ సెమిస్టర్‌లో 77.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పద్మ, కృష్ణారావు పాల్గొన్నారు.

March 5, 2026 / 04:43 AM IST

నేటి నుంచి 20 రోజుల పాటు కరెంటు కోత

PLD: నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో ఆర్‌డీఎస్‌ఎస్ (RDSS) పథకం కింద విద్యుత్ లైన్లను సింగిల్ ఫేజ్ నుంచి త్రీ ఫేజ్‌గా మార్చే పనులు చేపట్టారు. పాత పోల్స్, కండక్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ సుచరిత తెలిపారు. ఈ పనుల వల్ల నేటి నుంచి 20 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 7నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

March 5, 2026 / 04:31 AM IST

పన్ను వసూళ్లపై కమిషనర్ ఆగ్రహం

GNTR: జీఎంసీకి పన్ను బకాయిలు చెల్లించని ప్రధాన డిఫాల్టర్లకు వెంటనే ‘రెడ్ నోటీసులు’ జారీ చేయాలని కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన సమీక్షలో పన్ను వసూళ్ల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఐల వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి, గతేడాది కంటే 30 శాతం అధికంగా వసూళ్లు సాధించాలని ఆయన స్పష్టం చేశారు.

March 5, 2026 / 04:20 AM IST