KRNL: మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను బుధవారం ఆలూరు YCP ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి తీవ్రంగా ఖండించారు. శాసన మండలి ఛైర్మన్‌ను కులం పేరుతో దూషించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. లడ్డూ కల్తీ అంశం నుంచి చర్చను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి వెంటనే తన మాటలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలన్నారు.