WGL: మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ వరప్రదాయినిగా మారింది. పదో తరగతి తర్వాత తక్కువ సమయంలోనే ఇంజినీరింగ్ మెలకువలు నేర్చుకునేందుకు ఈ కోర్సులు దోహదపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు స్వయం ఉపాధితో పాటు, పారిశ్రామిక రంగంలో తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం డిప్లొమా వైపు మొగ్గు చూపుతున్నారు.