• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

యాదాద్రి శ్రీవారికి భారీగా తగ్గిన నిత్య ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మినరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.3,61,780, కార్ పార్కింగ్ రూ. 1,07,500, VIP దర్శనాలతో రూ.1,05,000, బ్రేక్ దర్శనాలతో రూ.50,400, ప్రధాన బుకింగ్ రూ. 85,150, వ్రతాలతో రూ.34,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.8,18,368, ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.

March 5, 2026 / 07:04 AM IST

నిడిగొండలో చాళుక్యుల కాలం నాటి వీరగల్లులు

JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ, కురుమగూడెం పొలాల్లో చాళుక్యుల కాలం నాటి వీరగల్లులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. బృంద సభ్యుడు కెవిజికె ఆచార్య బృందం వీటిని కనుగొనగా, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శిల్పాల వివరాలను వెల్లడించారు. హైవే పక్కన ఉన్న వెంచర్లో విరిగిన వీరగల్లుపై అంతస్తు వీరస్వర్గం శిల్పాలు లభించాయి.

March 5, 2026 / 07:04 AM IST

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

NLG: అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న రెండు టిప్పర్లను మిర్యాలగూడ గ్రామీణ పోలీసులు బుధవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ఎస్సై లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..ఆలగడప టోల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరేడుచర్ల వైపు నుంచి మిర్యాలగూడ వైపు ఎలాంటి పత్రాలు లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు.

March 5, 2026 / 07:02 AM IST

మంత్రిని కలిసిన అంతర్జాతీయ క్రీడాకారుడు

NRPT: అంతర్జాతీయ క్రీడాకారుడు మృత్యుంజయుడు సుంకర్ బుధవారం హైదరాబాద్లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు. ఇటీవల అబుదాబిలో జరిగిన ఓపెన్ వరల్డ్ మాస్టర్స్ గేమ్స్-2026లో కాంపిటేటివ్ క్రికెట్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన విజయాన్ని మంత్రికి వివరించారు. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన లెవల్-2 కోచింగ్ పరీక్షకు ఎంపికైయ్యాడు.

March 5, 2026 / 07:02 AM IST

నేడు ఈ కాలనీల్లో నీటి సరఫరా బంద్

MBNR: జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్‌మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

March 5, 2026 / 07:01 AM IST

దేవరపల్లిలో ప్రత్యేక గ్రామసభ.. హాజరుకానున్న ఎమ్మెల్యే

E.G: పీఎం కృషి సంచాయి యోజన నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై చర్చించేందుకు గురువారం దేవరపల్లి నిర్వహించే గ్రామసభలో ఎమ్మెల్యే వెంకటరాజు పాల్గొంటారని ఉప్పులూరు రామారావు తెలిపారు. సర్పంచ్ కడిమి వీరకుమారి అధ్యక్షతన పడమర చెరువు అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై ఈ సభలో నిర్ణయాలు తీసుకోనున్నారు. గ్రామ అభివృద్ధి పనులపై చర్చించే ఈ సభకు ప్రజలు హాజరుకావాలన్నారు.

March 5, 2026 / 07:00 AM IST

వైసీపీ నాయకుడిపై కేసు నమోదు

అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుగుంట మటన్ మార్కెట్ కాలనీలో నివాసముంటున్న వైసీపీ నాయకుడు వడ్డే పెద్దన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలనీలో మహిళలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో నిందితుడు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసినట్లు బాధితులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

March 5, 2026 / 07:00 AM IST

ఆలెన్ విధ్వంసం.. హెట్‌మెయిర్ రికార్డ్ బ్రేక్

T20 WC సెమీస్: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ ఆలెన్ 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో విధ్వంసకర అజేయ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతను ఒకే ఎడిషన్ T20 WCలో అత్యధికంగా 20* సిక్సర్లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్‌మెయిర్(19) రికార్డ్ బ్రేక్ చేశాడు. షాహిబ్జాదా ఫర్హాన్(18) మూడో స్థానంలో ఉన్నారు. ఈ 3 రికార్డులూ ఈ టోర్నీలోనే నమోదవడం విశేషం.

March 5, 2026 / 06:57 AM IST

ఈఆర్‌సీ ఛైర్మన్‌కు ఘన స్వాగతం పలికిన కలెక్టర్

SRCL: జిల్లా కలెక్టరేట్‌లో ఈఆర్‌సీ ఛైర్మన్‌ డాక్టర్ జస్టిస్ నాగార్జునకు కలెక్టర్ గరీమ అగర్వాల్ ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు ఆయన హాజరయ్యారు. ఈఆర్‌సీ కే రఘు, టెక్నికల్ విభాగం సభ్యుడు, పాల్గొన్నారు.

March 5, 2026 / 06:57 AM IST

నేడు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత

VSP: జీవీఎంసీ రైవాడ మంచినీటి సరఫరా పథకం ప్రధాన 1000 పీఎస్సీ పైపులైన్‌లో లీకేజీల మరమ్మత్తుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. లక్ష్మీనగర్, జ్యోతినగర్ గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో పైపులైన్ మరమ్మతులు చేపట్టనున్నట్లు జీవీఎంసీ కమిషసర్ తెలిపారు.

March 5, 2026 / 06:57 AM IST

ఐటీ ఉద్యోగులే లక్ష్యం.. వారికే డ్రగ్స్ విక్రయం

MDCL: మియాపూర్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.5 లక్షల విలువచేసే 12.6 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి బెంగళూరు నుంచి తెచ్చి HYDలో వీరు విక్రయిస్తున్నట్లు తెలిపారు.

March 5, 2026 / 06:56 AM IST

ప్రేమ వివాహం.. చివరకు విషాదం

ELR: భార్య దూరమవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు గానుగులపేటలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న బలిజేరెడ్డి చైతన్య (30) TG సిద్ధిపేట జిల్లా ఏడూళ్లబయ్యారానికి చెందిన రితికాను ప్రేమించి 2024లో వివాహం చేసుకున్నాడు. ఆమెకు TGలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో మనోవేదనతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమమాచారం.

March 5, 2026 / 06:55 AM IST

14వ రోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు

AP: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శాఖలవారీగా బడ్జెట్ డిమాండ్లపై ఏడో రోజు చర్చ కొనసాగించనన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ సవరించిన వ్యయాలపై ఆమోదం కోసం ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రతిపాదించనున్నారు.

March 5, 2026 / 06:54 AM IST

విరోష్ వివాహ రిసెప్షన్ వేడుకలో ఎమ్మెల్యే

ASF: హైదరాబాద్ నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 5, 2026 / 06:52 AM IST

సెంట్రల్ ఫోర్సులో అక్కాచెల్లళ్లకు ఉద్యోగాలు..సన్మానం

MNCL: సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలు సాధించిన జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్‌కు చెందిన అక్క, చెల్లెళ్లను పలువురు శాలువాలు కప్పి సన్మానించారు. బొమ్మిడి రాజేందర్-సుజాత దంపతుల ఇద్దరు కుమార్తెలు శ్రావ్యరాణి, ప్రవళికలు CISF, IBCF సెంట్రల్ ఫోర్సులో ఉద్యోగాలలో చేరారు. ఇంటికి వచ్చిన ఆ ఇరువురిని హరిత రిసార్ట్ ఆవరణలో శాలువాలు కప్పి సన్మానించారు.

March 5, 2026 / 06:51 AM IST